ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’తో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. కాగా ‘సరిలేరు…’ తరువాత ఇప్పటివరకు తన నెక్స్ట్ వెంచర్ ని ప్రకటించని అనిల్.. తన దర్శకత్వంలోనే రూపొందిన ఓ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నాడట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. 2019 సంక్రాంతికి హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలచిన చిత్రం ‘ఎఫ్ 2’. హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా అనిల్ తెరకెక్కించిన ఈ కుటుంబ కథా చిత్రంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకులుగా నటించారు. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా ‘ఎఫ్ 3’ని రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట అనిల్. అంతేకాదు.. ఇప్పటికే స్క్రిప్ట్‌ను కూడా లాక్ చేసిన అనిల్.. తన టీమ్‌తో కలసి స్క్రిప్ట్‌ను ఫైనల్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాడని వినికిడి. అలాగే తొలి భాగంలో హీరోలుగా నటించిన వెంకీ, వరుణ్ ఇందులోనూ నటిస్తారని సమాచారం. మరి.. `ఎఫ్ 2`తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అనిల్.. సీక్వెల్‌తోనూ అదే బాట పడతాడేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: