యన్టీఆర్ ‘షావుకారు’కు 70 ఏళ్ళు

NTR Timeless Classic Shavukaru Completes 70 Years

మహానటుడు యన్.టి.రామారావు, దిగ్గ‌జ ద‌ర్శ‌కులు య‌ల్.వి.ప్ర‌సాద్ మ‌ధ్య మంచి అనుబంధమే ఉంది. య‌న్టీఆర్‌ను వెండితెర‌కు ప‌రిచ‌యం చేయ‌డ‌మే కాదు.. య‌న్టీఆర్‌తో ప‌లు విజ‌య‌వంత‌మైన సినిమాలనూ తెర‌కెక్కించారు ద‌ర్శ‌కులు య‌ల్.వి.ప్ర‌సాద్. అలా య‌న్టీఆర్ తొలి చిత్రం ‘మ‌న‌దేశం’(1949)తో మొద‌లైన వీరి ప్ర‌యాణం.. ‘అప్పు చేసి పప్పుకూడు’(1959) వరకు సాగింది. అటువంటి వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన అపురూప‌ చిత్రాల్లో ‘షావుకారు’ ఒకటి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యన్.టి.రామారావు, జాన‌కి నాయ‌కానాయిక‌లుగా న‌టించ‌గా.. య‌స్.వి.రంగారావు, గోవింద‌రాజుల‌ సుబ్బారావు, రేలంగి, ప‌ద్మ‌నాభం, వంగ‌ర‌, శాంతకుమారి, క‌న‌కం ముఖ్య భూమిక‌లు పోషించారు. విశేషమేమిటంటే.. ఈ చిత్రంతోనే కథానాయికగా పరిచయమైన జానకి.. త‌ద‌నంత‌ర కాలంలో ఈ సినిమా టైటిల్‌నే తన ఇంటిపేరుగా మార్చుకుని `షావుకారు` జాన‌కిగా ప్రాచూర్యం పొందారు. అలాగే ఈ చిత్రంతోనే ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ విజ‌యా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మాణ‌రంగంలో తొలి అడుగేయ‌డం మ‌రో విశేషం.

`షావుకారు`కి స‌ముద్రాల సీనియ‌ర్ గీత ర‌చ‌న చేయ‌గా.. దిగ్గ‌జ గాయ‌కులు, సంగీత ద‌ర్శ‌కులు ఘంట‌సాల స్వరకల్పన చేసారు. వాటిలో “ప‌లుక‌రాద‌టె చిలుకా”, “ఏమ‌నెనే చిన్నారి”, “భ‌లే దొర‌ల‌కు దొర‌క‌ని”, “మారి పోవురా కాల‌ము”, “స్త్రీలు చెలంగే భారత‌భూమిని” వంటి పాట‌లు విశేషాద‌ర‌ణ పొందాయి. 1950 ఏప్రిల్ 7న విడుదలైన ‘షావుకారు’.. నేటితో 70 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.