దేశం కోసం కాజల్ సందేశం

Actress Kajal Aggarwal Urges People To Help and Support Local Business

కరోనా వైరస్ కారణం గా ప్రజలు భయాందోళనలతో జీవిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇళ్ళకే పరిమితం అయ్యారు. ప్రాణాంతక వ్యాధి కరోనా మహమ్మారి నివారణ కై ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. కరోనా కారణం గా అన్ని పరిశ్రమలు నష్టాలకు గురి అవుతున్నాయి. దేశం ఆర్ధికంగా కోలుకోవాలంటే ఏం చేయాలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రజలకు ఒక సందేశం ఇచ్చారు.

దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించే దిశగా స్థానిక ఉత్పత్తులనే కొందామని, విహార యాత్రలకు, మూవీ షూటింగ్స్ కు భారత దేశం లోనే ప్లాన్ చేసుకుందామని, భారతీయ పరిశ్రమలను ప్రోత్సహించి దేశం ఆర్ధికంగా కోలుకునే విధంగా మనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం అంటూ ప్రజలకు తన సందేశాన్ని కాజల్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. కాజల్ సందేశం ను ప్రజలు పాటిస్తే దేశం ఆర్ధికంగా పుంజుకొనే అవకాశం ఉంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here