ఇంతకు ముందే రాజీవ్ కనకాల సోదరి లక్ష్మీ కనకాల మృతి చెందిన వార్త విన్నాం. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీలక్ష్మీ కనకాల నేడు తుది శ్వాస విడిచారు. ఇప్పుడు మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వా జ్ కు మాతృ వియోగం కలిగింది. తమ్మారెడ్డి భరద్వాజ్ మాతృమూర్తి కృష్ణవేణి గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో… నేడు తుది శ్వాస విడిచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం కరోనా వల్ల ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి కావడంతో… చాలా మంది ఫోన్ లు చేస్తున్నారని.. తనను పరామర్శించడానికి ఎవరూ ఇంటికి రావొద్దని అయన కోరారు.
ఇక తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి కృష్ణమూర్తి కూడా చిత్ర నిర్మాతే. రవీంద్ర ఆర్ట్స్ బ్యానర్ పై ఆయన పలు సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. ఇక వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు లెనిన్ బాబు. ఈయన కూడా దత్త పుత్రుడు, డాక్టర్ బాబు లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక చిన్న కుమారుడు తమ్మారెడ్డి భరద్వాజ్.. ఈయన కూడా దర్శకుడిగా, నిర్మాతగా పలు విజయవంతమైన సినిమాలు రూపొందించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































