ఫేక్ న్యూస్ పట్టించుకోవద్దు – మహేష్ బాబు

Don't Trust Fake News About Corona Virus Says Super Star Mahesh Babu

కరోనా మహమ్మారి కారణం గా ప్రజలంతా ఇళ్ళకే పరిమితం అయ్యారు. ఈ రోజు “వరల్డ్ హెల్త్ డే ” సందర్భంగా మహేష్ బాబు తన ట్వీట్స్ ద్వారా ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. 2వారాల లాక్ డౌన్ కారణం గా మనం స్ట్రాంగ్ గా తయారయ్యామని, కరోనా వైరస్ నివారణకై మన ప్రభుత్వం తీసుకున్న చర్యలను అభినందిద్దాం అని, COVID-19 నివారణకు ముందుండి పోరాటం చేస్తున్న వారికి “వరల్డ్ హెల్త్ డే ” సందర్భంగా థ్యాంక్స్ చెబుదామని, మన హెల్త్ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడి వీధులలో, హాస్పటల్స్ లో పోరాడే ధైర్యస్థులకు ప్రశంసలు తెలపాలని ట్వీట్ చేశారు.

సామాజిక దూరం, శుభ్రత లతో పాటు ఫియర్ డిస్టెన్సింగ్ పై కూడా శ్రద్ధ పెట్టాలని, భయం తో నెగటివ్ పబ్లిసిటీ, ఫేక్ న్యూస్ క్రియేట్ చేసేవారికి దూరంగా ఉండాలని, ఫేక్ న్యూస్ ఇప్పుడు సరికొత్త ప్రాబ్లమ్ అని, మిస్ గైడ్ చేసే సమాచారాన్ని దూరంగా ఉండాలని, అందరితో ప్రేమ, ఆప్యాయత, సానుభూతి తో మెలగాలని, ఈ కష్ట సమయంలో ఒకరికి ఒకరం సహాయపడుతూ ప్రయాణం సాగిద్దామని , భయానికి దూరం గా ఉండమని, స్టే హోమ్, స్టే సేఫ్ అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here