పెళ్లి వాయిదా తప్పట్లేదు..!

Actor Nikhil Siddharth Postpones His Wedding Due To Lockdown
Actor Nikhil Siddharth Postpones His Wedding Due To Lockdown

ఏది ఏమైనా పెళ్లి ఆపే ప్రసక్తే లేదు.. అవసరమైతే గుడిలో పెళ్లి చేసుకుంటా అని యంగ్ హీరో నిఖిల్ చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. కరోనా వల్ల ఎక్కడి పనులు అక్కడ ఆపేసి అందరూ ఇంటికే పరిమితమైన తరుణంలో నిఖిల్ కూడా తన పెళ్లిని వాయిదా వేసుకోక తప్పలేదు. లాక్ డౌన్ కారణంగా తన వివాహాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు నిఖిల్ ప్రకటించారు. “ప్రస్తుత పరిస్థితుల్లో మేము వివాహం చేసుకోవడం సాధ్యమవుతుందని నేను అనుకోను. అందుకే మా వివాహాన్ని వాయిదా వేయడం తప్ప మాకు వేరే మార్గం లేదు” అని నిఖిల్ తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భీమవరం కు చెందిన డాక్టర్ పల్లవి వర్మ తో ఫిబ్రవరి 1వ తేదీన నిఖిల్ నిశ్చితార్ధం పెద్దల సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే. ఇంకా పెళ్లి ముహుర్తాన్ని ఏప్రిల్ 16 వ తేదీకి ఫిక్స్ చేశారు. అయితే ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ పెళ్లి వాయిదా వేశారు.

ప్రస్తుతం కుమారి 21 ఎఫ్‍ ఫేమ్‍ పల్నాటి సూర్య ప్రతాప్‍ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ’18 పేజీస్’ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనుంది. ఈ చిత్రానికి సుకుమార్ కథ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తుండగా సుకుమార్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + four =