‘ఆర్ఆర్ఆర్’ – ఎన్టీఆర్ కి బాబాయ్ గా సూపర్ స్టార్..?

Super Star Mohanlal To Play A Pivotal Role In RRR
Super Star Mohanlal To Play A Pivotal Role In RRR

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం'(ఆర్ఆర్ఆర్). ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా… ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నాడు. ఇటీవలే ఉగాది సందర్బంగా ఈ సినిమా టైటిల్ ”రౌద్రం రుధిరం రణం” మోషన్ పోస్టర్ ను… రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్బంగా అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇక చెర్రీ టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చెర్రీ యాక్షన్ కు, ఎన్టీఆర్ వాయిస్ తోడై టోటల్ గా గూస్ బంప్స్ తెప్పించింది టీజర్. ఇప్పుడు వచ్చే నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు ఉండటంతో ఆ రోజు కొమురం భీమ్ పాత్రకు సంబంధించిన వీడియోను విడుదల చేయాలని చూస్తున్నారట. చూద్దాం ఎన్టీఆర్ ను ఎలా చూపిస్తాడో జక్కన్న.

ఇక ఇక్కడివరకూ బాగానే ఉన్నా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పాత్ర కోసం మోహన్ లాల్ అయితే బావుంటుందని రాజమౌళి మోహన్ లాల్ ను అడుగగా…మోహన్ లాల్ కూడా ఆ పాత్రలో నటించడానికి అంగీకరించారని తెలుస్తుంది. ఇంతకీ ఆ పాత్ర ఏంటనుకుంటున్నారా..? ఎన్టీఆర్ బాబాయ్ పాత్ర అట. కొమరం భీమ్ జీవితంలో ఆయన బాబాయి పాత్ర చాల కీలకం అట. అందుకే మోహన్ లాల్ ను ఎంపిక చేసినట్టు సమాచారం. ఇక దీనిపై జక్కన్ననే క్లారిటీ ఇవ్వాలి. మరి ‘జనతా గ్యారేజ్’ సినిమా లో మోహన్ లాల్, ఎన్టీఆర్ కాంబినేషన్ చూశాం ఎలా ఉంటుందో. ఇక ఈ సినిమలో కూడా ఉంటే కళ్ళకు పండగే గా మరి…

ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 8వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here