“టామ్ అండ్ జెర్రీ”లా నిత్యం పోట్లాడుకుంటూ ఉండే ఇద్దరు అన్నదమ్ముల మధ్య అంతర్లీనంగా ఉండే భావోద్వేగాలను.. వినోదాత్మకంగా వెండితెరపై ఆవిష్కరించిన చిత్రం ‘రేసుగుర్రం’. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ‘కిక్’ శ్యామ్ అన్నదమ్ములుగా నటించిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను.. సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. శ్రుతి హాసన్ కథానాయికగా నటించగా.. సలోని, తనికెళ్ళ భరణి, పవిత్ర లోకేష్, ప్రకాష్ రాజ్, ప్రగతి, రవికిషన్, ముకేష్ రుషి, బ్రహ్మానందం, అలీ, పోసాని కృష్ణ మురళి, ఎం.యస్.నారాయణ ముఖ్య భూమికలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బన్నీ కెరీర్‌లో తొలిసారి బ్రదర్ సెంటిమెంట్‌తో రూపొందిన ఈ చిత్రంలో.. బన్నీ ఎనర్జీ లెవెల్స్‌కి తగ్గ కథను రాసుకోవడంలో నూటికి నూరు శాతం విజయం సాధించాడు దర్శకుడు. “నీ గురించి నాకు చెప్పి, నా గురించి నువ్వు తెలుసుకుని రేసు మొదలు పెట్టొద్దు.. ఎందుకంటే రేసులో నన్ను అందుకోవడానికి రన్నర్‌ని కాదురా.. రేసుగుర్రాన్ని” అంటూ సాగే డైలాగ్ సినిమాలో హీరో క్యారెక్టర్‌ని ఎలివేట్ చేస్తుంది.
ఇక పాటల విషయానికొస్తే.. చంద్రబోస్, రెహమాన్, విశ్వ, వరికుప్పల యాదగిరి అందించిన సాహిత్యానికి.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఆకట్టుకునే బాణీలు అందించారు. “సినిమా చూపిస్త మావా”, “రేసుగుర్రం”, “స్వీటీ”, “బూచాడే బూచాడే”, “గలగల”, “డౌన్ డౌన్”.. వంటి పాటలు కుర్రకారును ఉర్రూతలూగించాయి. శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలుపు శ్రీనివాస్, డా.వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. ఉత్తమ హాస్యనటుడు(బ్రహ్మానందం), ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్(పి.రవిశంకర్) విభాగాల్లో “నంది” పురస్కారాలతో పాటు పలు ప్రాంతీయ అవార్డులను కూడా కైవసం చేసుకుందీ సినిమా. 2014 ఏప్రిల్ 11న విడుదలై ఘనవిజయం సాధించిన ‘రేసుగుర్రం’.. నేటితో ఆరేళ్ళను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: