‘పుష్ప’ కోసం ఐట‌మ్, టైటిల్ సాంగ్‌ రెడీ?

Rockstar Devi Sri Prasad Composes Special Song For Sukumar's Pushpa Movie

బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్, టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ కాంబినేషన్ అంటేనే మ్యూజికల్ సెన్సేషన్. ‘ఆర్య’ నుండి ‘రంగస్థలం’ వరకు వీరిద్దరి కలయికలో వచ్చిన ఏ చిత్రం కూడా పాటల పరంగా డిజప్పాయింట్ చేసిన సందర్భం లేదు. మరీ ముఖ్యంగా.. ఐటమ్ సాంగ్ విషయంలో. ఒక్క ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని మినహా ఇస్తే.. సుక్కు, దేవిశ్రీ కాంబోలో వచ్చిన ప్రతీ సినిమాలోనూ ఐటమ్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. “అ అంటే అమ‌లాపురం”(‘ఆర్య’), “36,26,36”(‘జ‌గ‌డం’), “రింగ రింగ”(‘ఆర్య‌2’), “డియ్యాలో డియ్యాలా”(‘100% ల‌వ్’), “లండ‌న్ బాబు”(‘1: నేనొక్క‌డినే’), “జిగేల్ రాణి”(‘రంగ‌స్థ‌లం’).. ఇలా ప్రతీ ‘ప్రత్యేక గీతం’ కుర్రకారును ఉర్రూతలూగించింది. ఈ నేపథ్యంలోనే.. సుక్కు, డీఎస్పీ కాంబినేషన్‌లో రానున్న‌ తదుపరి చిత్రం ‘పుష్ప’లో కూడా ఐటమ్ సాంగ్‌కి స్థానం ఉందట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్ష‌న్‌లో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. త్వరలో మలి దశ చిత్రీకరణకు వెళ్లనుంది. అంతేకాదు.. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటలకు సంబంధించి రెండు ట్యూన్స్ రెడీ అయినట్టు తెలిసింది. అందులో ఒకటి టైటిల్ సాంగ్ కాగా.. మరొకటి ఐటమ్ సాంగ్. వీటిలో ఒక పాటకు డీఎస్పీ సాహిత్యం అందించాడని సమాచారం. అంతేకాదు.. సినిమాకే ప్ర‌త్యేకాక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్న ఐటమ్ సాంగ్‌లో ఉత్త‌రాది భామ నర్తించ‌నుందని టాక్. గ‌తంలో బన్నీ, సుక్కు, డీఎస్పీ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘ఆర్య‌’, ‘ఆర్య‌2’ ఐటమ్ సాంగ్స్ సరసన ఈ ఐటమ్ సాంగ్ కూడా చేరుతుందేమో చూడాలి. త్వ‌ర‌లోనే ఈ ఐట‌మ్ సాంగ్‌పై మరింత క్లారిటీ వస్తుంది.

ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టిస్తున్న ‘పుష్ప’ని హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. పాన్ – ఇండియా ఫిల్మ్‌గా రూపొందుతున్న ‘పుష్ప’ని 2021 వేసవికి రిలీజ్ చేయబోతున్నారని ప్రచారం సాగుతోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =