కరోనా క్రైసిస్ ఛారిటీ కి బ్రహ్మానందం విరాళం

Tollywood Ace Comedian Brahmanandam Donates Money To Corona Crisis Charity Foundation

కరోనా మహమ్మారి కారణంగా దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. అనేక పరిశ్రమలతో పాటు చిత్ర పరిశ్రమ కూడా మూతపడింది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ రద్దయి రోజు వారీ జీతాలపై బ్రతికే పేద కళాకారులు, కార్మికుల జీవనం దుర్భరంగా మారింది. మెగా స్టార్ చిరంజీవి కొంతమంది సినీప్రముఖులతో డిస్కస్ చేసి కరోనా క్రైసిస్ చారిటీ నెలకొల్పి , తోటి నటీనటుల విరాళాలతో సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేస్తూ ఆదుకుంటున్నారు. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కరోనా క్రైసిస్ ఛారిటీ కి 3 లక్షలు విరాళాన్ని ఈ రోజు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కామెడీ కే కొత్త అర్ధాన్ని చెప్పిన బ్రహ్మానందం మూడు దశాబ్దాలకు పైగా తనదైన కామెడీ స్టైల్ లో ప్రేక్షకులను అలరిస్తున్నారు. 1000 చిత్రాలకు పైగా నటించి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ లో స్థానం పొందారు. బెస్ట్ కమెడియన్ గా పలు అవార్డ్స్ అందుకున్న బ్రహ్మానందం భారత దేశ అత్యున్నత పురస్కారం “పద్మశ్రీ ” అందుకున్నారు. బ్రహ్మానందం కమెడియన్ గా నటించిన పలు మూవీస్ ఘనవిజయం సాధించాయి. టాలీవుడ్ లో బ్రహ్మానందం స్టార్ కమెడియన్ గా రాణిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + eight =