‘వకీల్ సాబ్’ లో నేను నటించట్లేదు..!

I am Not Playing Any Role In Pawan Kalyan's Vakeel Saab Movie Says Actress Shruti Haasan
I am Not Playing Any Role In Pawan Kalyan's Vakeel Saab Movie Says Actress Shruti Haasan

పవన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్’ చేస్తున్నసంగతి తెలిసిందే కదా. ఈ సినిమా చాలా వేగంగానే షూటింగ్ ను జరుపుకుంది. ఇక కరోనా వల్ల శరవేగంగా జరుపుకుంటున్న షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమాను మే 15న రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ… అది కూడా వాయిదా పడనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో ఇప్పటికే నివేదా థామస్, అంజలి నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఉండనుందని.. ఫ్లాష్ బ్యాక్ లో పవన్ కి భార్యగా శృతి హాసన్ నటించనుందన్న వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. అయితే ఈ వార్తలపై శృతి హాసన్ క్లారిటీ ఇచ్చింది. ‘వకీల్ సాబ్’ సినిమాలో నేను చేయడం లేదు. ఈ సినిమాలో నేను నటిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. త్వరలో నేను షూటింగులో పాల్గొననున్నట్టు చెప్పుకుంటున్నారు .. అదంతా కేవలం పుకారు మాత్రమే” అని చెప్పుకొచ్చింది.

కాగా ‘వకీల్ సాబ్’ సినిమాను బోనీ కపూర్‌ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్, థీం సాంగ్‌ను రిలీజ్ చేయగా వాటికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + twenty =