స్టార్ డైరెక్టర్లతోనే యన్టీఆర్ వరుస చిత్రాలు

Young Jr NTR Lines Up Interesting Projects?

యంగ్ టైగర్ యన్టీఆర్ ఈ మధ్య సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా ‘అర‌వింద స‌మేత‌’ నుంచి అగ్ర దర్శకులతోనే వరుస చిత్రాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రీవియస్ మూవీ ‘అర‌వింద స‌మేత‌’ని సెల్యూలాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో చేసిన తారక్.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘ఆర్ ఆర్ ఆర్’(‘రౌద్రం ర‌ణం రుధిరం’) ని ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి డైరెక్షన్‌లో చేస్తున్నారు. మల్టీస్టారర్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ పేట్రియాటిక్ డ్రామా.. 2021 సంక్రాంతికి రిలీజ్ కానుంది. కాగా, ఈ చిత్రం త‌రువాత‌ తారక్ నుంచి రాబోతున్న సినిమాలు కూడా అగ్ర దర్శకుల కలయికలోనే తెరకెక్కనున్నాయని టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత యన్టీఆర్ చేయబోయే సినిమా త్రివిక్రమ్ కాంబినేషన్ (‘యన్టీఆర్ 30’) లో ఉంటుందని ఇప్పటికే అధికారిక ప్రకటన రాగా.. ఆ పై ‘కె.జి.ఎఫ్’ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ దర్శకత్వంలో ‘యన్టీఆర్ 31’ ఉంటుందని జోరుగా ప్రచారం సాగుతోంది. అలాగే తనకు ‘జ‌న‌తా గ్యారేజ్’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీని అందించిన కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లోనూ తారక్ మరోసారి నటించే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ ఇన్ఫర్మేషన్. ఇది ‘యన్టీఆర్ 32’ గా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. మొత్తమ్మీద.. యన్టీఆర్ నుంచి రానున్న తదుపరి నాలుగు చిత్రాలు కూడా స్టార్ డైరెక్టర్లతోనే తెరకెక్కనుండడం విశేషం. త్వరలోనే ప్రశాంత్ నీల్, కొరటాల శివ కాంబినేష‌న్ మూవీస్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. మరి.. ఈ నాలుగు చిత్రాలలో ఏ యే సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.