విజయ్ ‘మాస్టర్’ ను లాక్ డౌన్ ఆపలేదు..!

లోకేష్ కనగరాజు దర్శకత్వంలో విజయ్ ‘మాస్టర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. నిజానికి ఈ సినిమా ఈ నెల 9న విడుదల కావాల్సి ఉంది కానీ తెలిసిన విషయమే కదా… లాక్ డౌన్ వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. అయితే లాక్ డౌన్ లో కూడా సినిమా అప్ డేట్స్ ఇస్తూ అభిమానులకు కాస్త ఊరటనిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్ లో ‘మాస్టర్’ను లాక్ డౌన్ ఏమీ చేయలేదు .. త్వరలో ‘మాస్టర్’ను మీరు చూస్తారు అని ఈ పోస్టర్ పై తెలిపారు. దీన్నిబట్టి ఈ సినిమా నుండి టీజర్ ను విడుదల చేస్తారేమో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరి త్వరలో అన్నారు కానీ.. డేట్ మాత్రం చెప్పలేదు..చూద్దాం మరి

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో విజయ్‌ కు జోడీగా మాళవిక మోహనన్ నటిస్తుంది. ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నాడు. మలయాళ నటుడు ఆంటొని, శాంతను కీలక పాత్రలు చేస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులోను కూడా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో విజయ్ గ్యాంగ్ స్టర్ గా .. కాలేజ్ ప్రొఫెసర్ గా రెండు విభిన్నమైన లుక్స్ తో కనిపించనున్నాడు. మరి ఇటీవలే బిగిల్ సినిమాతో హిట్ కొట్టిన విజయ్.. ఈ సినిమాతో ఎంత హిట్ కొడతాడో చూడాలి…

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =