విజ‌య‌శాంతి ‘ప‌డ‌మ‌టి సంధ్యారాగం’కు 33 ఏళ్ళు

Vijayashanti's Padamati Sandhya Ragam Completes 33 Years

“ప్రేమ‌కు కులం, మ‌తమే కాదు ఎల్ల‌లు కూడా లేవ‌”ని చాటి చెప్పిన చిత్రం ‘ప‌డ‌మ‌టి సంధ్యారాగం’. లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి, హాలీవుడ్ యాక్ట‌ర్ టామ్ జానే జంట‌గా న‌టించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను “హాస్య‌బ్ర‌హ్మ” జంధ్యాల తెర‌కెక్కించారు. సుధేష్ణ‌, “డ్ర‌మ్మ‌ర్” శివ‌మ‌ణి, “సుత్తి” వేలు, సుధ‌, గుమ్మలూరి శాస్త్రి, శేష‌గిరిరావు, విజ‌య్, ఆశాజ్యోతి, రవి చిట్టూరి ముఖ్య పాత్ర‌లు పోషించారు. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన “డ్ర‌మ్మ‌ర్” శివ‌మ‌ణితో పాటు.. టామ్ జానే కూడా ఈ సినిమాతోనే వెండితెర‌కు ప‌రిచ‌య‌మయ్యారు. అంతేకాదు.. తొంభై శాతం అమెరికాలో నిర్మిత‌మైన తొలి తెలుగు చిత్రంగా కూడా ‘ప‌డ‌మ‌టి సంధ్యారాగం’ ఖ్యాతిగాంచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వేటూరి సుంద‌ర‌రామ‌మూర్తి, స‌దాశివ బ్ర‌హ్మేంద్ర‌, ఎస్.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం గీత ర‌చ‌న చేయ‌గా.. గాన గంధర్వుడు ఎస్.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం స్వ‌రాలు స‌మ‌కూర్చారు. వాటిలో “ఈ తూరుపు ఆ పశ్చిమం”, “పిబ‌రే రామ‌ర‌సం”, “లైఫ్ ఈజ్ ష‌బ్బి”, “ముద్దుగారే య‌శోద‌”(అన్న‌మాచార్య కీర్త‌న‌).. వంటి గీతాలు ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాయి. ఈ సినిమాని ప్ర‌వాసాంధ్ర చిత్ర ప‌తాకంపై గుమ్మలూరి శాస్త్రి, మీర్ అబ్దుల్లా సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ చిత్రానికి గాను ఉత్త‌మ క‌థా ర‌చ‌యిత‌గా జంధ్యాల “నంది” పుర‌స్కారాన్ని అందుకున్నారు. 1987 ఏప్రిల్ 11న విడుద‌లై ప్రేక్ష‌కుల నీరాజ‌నాలు అందుకున్న ‘ప‌డ‌మ‌టి సంధ్యారాగం’.. నేటితో 33 ఏళ్ళను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =