కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 142

సినిమా వార్తలు

సినిమాలకు మరోసారి బ్రేక్ వేసిన పవన్...!

ఇన్ని రోజులు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా? చేయడా? అంటూ కన్ఫ్యూజన్ లో ఉండగా అభిమానులకు మాములు ఊరట ఇవ్వలేదు పవన్. ఒక్క సినిమాతో కాదు ఏకంగా పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. ప్రస్తుతం హిందీలో సూపర్ హిట్ కొట్టిన పింక్ రీమేక్ ను తెలుగులో 'వకీల్ సాబ్' సినిమాను చేస్తున్నాడు. శ్రీరామ్ వేణు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక వీటితో పాటు క్రిష్ తో మరో సినిమాను చేస్తున్నాడు. పీరియాడిక్ డ్రామా గా ఈ సినిమా తెరకెక్కబోతుంది. హరీష్ శంకర్ తో మరో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు హరీష్ శంకర్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నిఖిల్ "కార్తికేయ 2" మూవీ 5భాషలలో రిలీజ్

"అర్జున్ సురవరం " మూవీ సక్సెస్ తో ఆనందంగా ఉన్న నిఖిల్ రెండు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో థ్రిల్లర్ మూవీ "18 పేజెస్ ", మరో మూవీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో మిస్టరీ థ్రిల్లర్ మూవీ "కార్తికేయ 2" పూజ కార్యక్రమాలు జరుపుకున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పిల్లలతో సరదాగా రవితేజ

కరోనా వైరస్ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కరోనా మహమ్మారి కారణంగా దేశమంతా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎప్పుడూ మూవీ షూటింగ్స్, ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉండే సినీ తారలు లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచి పోవడంతో ఇళ్ళకే పరిమితం అయ్యి కుటుంబ సభ్యులతో సరదాగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఆ వీడియోస్ సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సోషల్ మీడియాకు దూరంగా సామ్.. కారణం అదేనా..!

సెలెబ్రిటీస్ అంటేనే ఫోకస్ కొంచం ఎక్కువ ఉంటది. అందులో ఏ స్టార్ హీరోనో.. స్టార్ హీరోయినో అయితే ఇంక స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. వాళ్లు ఏం చేసినా నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే. ఇక ఇప్పుడు అలాంటిదే ఇక వార్త చక్కర్లు కొడుతుంది. అది కూడా సమంత పై. నిజానికి సమంత సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటదన్న సంగతి తెలిసిందే. తన సినిమాల గురించి, తాను చేసే పనులు గురించి, అప్పుడప్పుడు పర్సనల్ లైఫ్ గురించి కూడా ఏదో ఒక విషయాన్ని తన అభిమానులతో పంచుకునేది. అయితే ఇప్పుడు చాలా రోజుల నుండి సోషల్ మీడియాకు దూరంగా ఉంది సామ్. లాక్ డౌన్ ఎప్పుడైతే ప్రకటించారో అప్పటినుండి ఒకటి,రెండు పోస్టులు తప్పా.. ఇంత…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టిన మెగాస్టార్..!

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'ఆచార్య'. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం బ్రేక్ పడింది. కమర్షియల్ ఎలిమేట్స్ తో సామజిక అంశాలను మేళవించి చూపించడంలో కొరటాల దిట్ట కాబట్టి ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అతిథి పాత్రలో నాగచైతన్య ?

దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో రూపొందిన ఫాంటసీ కామెడీ "ఓ బేబీ " మూవీ ఘనవిజయంసాధించింది. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నందిని, సమంత కాంబినేషన్ లో రూపొందిన "జబర్దస్త్ ", "ఓ బేబీ " మూవీస్ ఘనవిజయం సాధించాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"పుష్ప "మూవీ లో విలన్ గా సునీల్ శెట్టి ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో "పుష్ప "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ఒక కొత్త గెటప్ లో, ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలోరూపొందుతున్న ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు విశేష స్పంద లభించింది.

Team TFNవాట్సాప్
Manchu Vishnu's Wholesome Family Entertainer Dhee Completes 13 Years
సినిమా వార్తలు

మంచు విష్ణు ‘ఢీ’కి 13 ఏళ్ళు

మంచు విష్ణు కెరీర్‌లో తొలి విజ‌య‌వంత‌మైన చిత్రంగానూ, కెరీర్ బెస్ట్ ఫిల్మ్‌గానూ నిలిచిన సినిమా ‘ఢీ’. వినోదాత్మ‌క చిత్రాల‌కు చిరునామాగా నిలిచిన దర్శ‌కుడు శ్రీ‌ను వైట్ల రూపొందించిన ఈ చిత్రంలో విష్ణుకు జోడిగా జెనీలియా న‌టించింది. శ్రీ‌హ‌రి, ప్రేమ‌, చంద్ర‌మోహ‌న్, ఢిల్లీ రాజేశ్వ‌రి, బ్ర‌హ్మానందం, సునీల్, శ్రీనివాస రెడ్డి, ఆకాష్, సుప్రీత్, జ‌య‌ప్రకాష్ రెడ్డి, మాస్ట‌ర్ భ‌ర‌త్, ‘చిత్రం’ శ్రీ‌ను ముఖ్య భూమిక‌లు పోషించారు.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

`బాహుబ‌లి - ది కంక్లూజ‌న్` విడుద‌ల తేదికి ‘ఆర్ ఆర్ ఆర్’?

యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న పేట్రియాటిక్ డ్రామా ‘ఆర్ ఆర్ ఆర్’ (‘రౌద్రం రణం రుధిరం’). వాస్తవ పాత్రలు, కల్పిత ఘట్టాలతో రూపొందుతున్న ఈ హిస్టారికల్ ఫిక్షన్‌లో కొమరం భీమ్‌గా తారక్ కనిపించనుండగా, అల్లూరి సీతారామరాజుగా చరణ్ దర్శనమివ్వనున్నాడు. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని.. తొలుత 2020 జూలై 30న విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే, కొన్ని కార‌ణాల వ‌ల్ల 2021 సంక్రాంతికి వాయిదా వేశారు. కాగా, ఇప్పుడు మ‌రోసారి ఈ క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా పడ‌నున్న‌ట్టు టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
సాంగ్

‘పుష్ప’లో కియారా అద్వానీ ప్ర‌త్యేక గీతం ?

‘ఆర్య‌’, ‘ఆర్య‌2’ త‌రువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. రష్మికా మంద‌న్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం కోసం బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఓ ప్ర‌త్యేక గీతంలో మెర‌వ‌నుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అనిల్ రావిపూడి తనయుడి కి మహేష్ బాబు స్క్రీన్ నేమ్

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన యాక్షన్ , కామెడీ మూవీ "సరిలేరు నీకెవ్వరు " రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దర్శకుడు అనిల్ రావిపూడి సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ "సరిలేరు నీకెవ్వరు " మూవీ లో మహేష్ బాబు మేజర్ అజయ్ కృష్ణ గా నటించారు. మహేష్ బాబు అజయ్ పేరుతో నటించిన "ఒక్కడు", " "దూకుడు "మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

టాలీవుడ్ సూపర్ స్టార్‌తో శాండ‌ల్‌వుడ్ సూప‌ర్ స్టార్?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్‌తో పాటు జి. మ‌హేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, కొర‌టాల శివ హోమ్ ప్రొడ‌క్ష‌న్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నాడ‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌రోసారి పవన్‌కి జోడీగా కాజల్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ స‌ర‌స‌న క‌నువిందు చేసిన కథానాయికల్లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ (2016) బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా.. ప‌వ‌న్, కాజ‌ల్ జంట స‌ద‌రు సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. కట్ చేస్తే.. స్వల్ప విరామం తరువాత పవన్, కాజల్ మ‌రోసారి కలిసి నటించేందుకు రంగం సిద్ధమవుతోందట.

Team TFNవాట్సాప్
తెలంగాణ పోలీసులను ప్రశంసించిన విజయ్ దేవరకొండ..!
సినిమా వార్తలు

తెలంగాణ పోలీసులను ప్రశంసించిన విజయ్ దేవరకొండ..!

వరుస పెట్టి అందరూ పోలీసులపై ప్రశంసలు కురిపించడం మొదలుపెట్టారు. ఒకరి తర్వాత ఒకరు పోలీసులను ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. మహేష్ బాబు తో మొదలైన ఈ ప్రశంసల పరంపర కొనసాగుతూనే ఉంది. మహేష్ బాబు, తర్వాత చిరు.. ఆ తర్వాత వెంకీ.. ఇప్పుడు యంగ్ అండ్ రౌడీ హీరో విజయ్ కూడా ఈ లిస్ట్ లో చేరాడు. అయితే విజయ్ మాత్రం డైరెక్ట్ గా తెలంగాణ పోలీస్‌ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించి.. పోలీసులను ప్రశంసించాడు. పోలీసులు రియ‌ల్ హీరోస్ అంటూ.. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారని విజయ్‌ ప్రశంసించాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ తరఫున తెలంగాణ పోలీసులకు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'రామ్' డైలమాలో లేడంటున్న 'రామ్'

కరోనా వల్ల సినిమా సినిమా రిలీజ్ మొత్తం వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ రెండు నెలల్లో రిలీజ్ కావాల్సిన సినిమాలు మొత్తం వాయిదా వేసుకున్నాయి. తాజాగా లాక్ డౌన్ డేట్ కూడా పొడిగించారు . ఇక ఈ నెల కూడా కొత్త సినిమాలను చూసే అవకాశం లేనట్టే. ఇక ఈ నేపథ్యంలో తన సినిమాను థియేటర్ లోనే చూడమంటున్నాడు యంగ్ హీరో రామ్. రామ్ అలా చెప్పడానికి అసలు కారణం ఏంటంటే...

TFN Adminవాట్సాప్
ఆమె మా అమ్మ కాదు.. క్లారిటీ ఇచ్చిన చిరు..!
సినిమా వార్తలు

ఆమె మా అమ్మ కాదు.. క్లారిటీ ఇచ్చిన చిరు..!

కరోనా వ్యాధిని అడ్డుకునే నేపథ్యంలో అందరూ సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఇక దీనిలో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి కూడా తన స్నేహితురాళ్లతో కలిసి, మూడు రోజుల పాటు శ్రమించిన 700 మాస్క్ లను తయారు చేసి, వాటిని అవసరమైన వారికి అందించారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై మెగాస్టార్ చిరు స్పందించి ఆమె తన తల్లి కాదని క్లారిటీ ఇచ్చారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

థమన్ కు అల్లుఅర్జున్ అభినందనలు

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా రూపొందిన "అల .. వైకుంఠపురములో .. " మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. థమన్ ఎస్ సమకూర్చిన సంగీతం తో ఈ మూవీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. థమన్ స్వరపచిన సాంగ్స్ కు విశేష స్పందన లభించింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వర్మ ట్వీట్ కు కేటీఆర్ ఫన్నీ పంచ్..!

వర్మ ట్వీట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ట్వీట్స్ లో ఎప్పుడు ఏదో ఒక వ్యంగ్యం కనిపిస్తూనే ఉంటది. ఎప్పుడూ ఎదో ఒక విషయం పై వ్యంగ్యంగా స్పందించడం ఆయనకు అలవాటే. అయితే ఈసారి వర్మ ట్వీట్ కు పంచ్ వేశారు మంత్రి కేటీఆర్. నిన్న ట్విట్టర్ వేదికగా #AskKTR నిర్వహించారు. ఇక దీనిలో భాగంగా పలువురు నెటిజన్లు పలు డౌట్లను అడుగగా కేటీఆర్ వాళ్ళకి ఓపికగా సమాధానాలు చెప్పారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"మహా సముద్రం" మూవీ లో హీరోయిన్ సాయి పల్లవి ?

బ్లాక్ బస్టర్ "RX 100 " మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందనున్న "మహాసముద్రం " మూవీ కి హీరో శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. "మహాసముద్రం " మూవీ నుండి సమంత వైదొలగిన తరువాత సాయి పల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేయాలని దర్శకుడు ప్లాన్ చేశారు. ఈ మూవీ లో నటించేందుకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిఉంది.

Team TFNవాట్సాప్
You Are The Real Heroes Hails Telugu Film Fraternity To Police Department
సినిమా వార్తలు

మీరే 'రియల్ హీరోస్' హ్యాట్సాఫ్..!

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఇక డాక్టర్స్, పోలీసులు అయితే తమ ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలను కాపాడటంకోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో పని చేస్తోన్న వైద్యులు, పోలీసులపై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే మహేష్, చిరు పోలీసులను ప్రశంసించగా...వైద్యులు, పోలీసులపై సినీనటుడు వెంకటేశ్‌ ప్రశంసల జల్లు కురిపించారు. 'ఆసుపత్రుల్లో బాధితుల ప్రాణాలు కాపాడుతున్న సూపర్ ‌హీరోలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అలాగే, కరోనాపై పోరాడుతున్న పోలీసులకు ధన్యవాదాలు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మా ప్రాణాలు…

TFN Adminవాట్సాప్

షేర్