రియల్ లైఫ్ తండ్రీకొడుకులు.. రీల్ లైఫ్‌లో అన్నదమ్ములుగానో లేదా తండ్రీకొడుకులుగానో కనిపించడం షరా మామూలే. అయితే గురుశిష్యుల పాత్రల్లో దర్శనం ఇవ్వడం మాత్రం అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి అరుదైన అంశానికి వేదికగా నిలవనుంది మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’లో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్న సంగతి తెలిసిందే. మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో తాము(చిరు, చరణ్) తండ్రీకొడుకులుగా నటించడంలేదని, గురుశిష్యులుగా కనిపించనున్నామని ఇటీవల చిరు స్వయంగా వెల్లడించారు. మరి.. గురుశిష్యులుగా చిరు, చరణ్ మధ్య కెమిస్ట్రీ ఏ స్థాయిలో అలరిస్తుందో తెలియాలంటే ‘ఆచార్య’ విడుదల వరకు వేచి చూడాల్సిందే.
‘ఆచార్య’లో చిరుకి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా… మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































