రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే భద్రతా భాద్యతలను కట్టుదిట్టం చేసాయి. దీని దెబ్బకు ప్రతి ఒక్కరూ వణికిపోతుండగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇప్పుడు ఇళ్లకే పరిమితం అయిపోయారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఎంతో మంది దాతలు ముందుకొచ్చి భారీ విరాళాలు…పేదలకు అన్న దానాలు.. ఊర్లను దత్తత తీసుకోవడం ఇలా ఎవరి తాహతకు తగట్టు వారు సాయం చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు పీఎం, సీఎంల రిలీఫ్ ఫండ్ కు నిధులందిస్తున్నారు. ఇప్పుడు వీరి జాబితాలో ఇప్పుడు మెగా మథర్ కూడా చేరిపోయారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో కరోనా క్రైసెస్ చారిటీ పేరుతో విరాళాలు సేకరిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి తనకు చేతనైనంతలో సాయం చేసి, నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. తన స్నేహితురాళ్లతో కలిసి, మూడు రోజుల పాటు శ్రమించిన అంజనాదేవి, 700 మాస్క్ లను తయారు చేసి, వాటిని అవసరమైన వారికి అందించారు. తన వయసును, వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయకుండా ఆమె ఇంత కష్టపడటంతో పలువురు అభినందనలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టంట్లో వైరల్ అవుతున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: