ప్రాణాంతక కరోనా మహమ్మారి కారణంగా జనజీవనం కష్టాలపాలయింది. దేశవ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అవుతున్న విషయం తెలిసిందే. ప్రజలకు తమవంతు సాయంగా సినీ సెలబ్రిటీస్ PM, CM సహాయ నిధులకు విరాళాలు అం దిస్తున్నారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ఇంటి సభ్యులతో కలసి తమ ఇంటి సమీపంలో ఉన్న స్లమ్ఏరియాలో 250 కుటుంబాలకు ఆహరం అందిస్తున్నారు. రకుల్ ఇప్పుడు PM కేర్స్ ఫండ్ కై ఒక కొత్త ఐడియా ప్లాన్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లాక్ డౌన్ సమయం లో ఇంటికే పరిమితం అయిన సెలబ్రిటీస్ వర్క్ అవుట్స్, కుకింగ్, పెట్స్ వంటి వీడియోస్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేస్తున్నారు. ఒక అడుగు ముందుకు వేసి రకుల్ యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించారు. ఈ ఛానల్ లో ఫిల్మ్స్, ఫ్రెండ్స్, ఫుడ్, ఫిట్ నెస్ వంటి విషయాలతో రకుల్ ప్రేక్షకులను అలరించనున్నారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని PM కేర్స్ ఫండ్ కు రకుల్ అందజేయనున్నారు. రకుల్ ప్రయత్నానికి ఆల్ ది బెస్ట్ చెబుదాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: