మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా పాన్ ఇండియా మూవీ “పుష్ప” రూపొందుతున్న విషయం తెలిసిందే. రాయల సీమ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న “పుష్ప” మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న “పుష్ప” లో విలన్ గా ఒక బాలీవుడ్ హీరోను ఎంపిక చేయాలని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. సంజయ్ దత్ ,సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం. తమిళ హీరో విజయ్ సేతుపతి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందుతున్న “పుష్ప” మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: