బన్నీ పై కేరళ సీఎం ప్రశంసలు..!

Kerala Chief Minister Pinarayi Vijayan Appreciates Stylish Star Allu Arjun
Kerala Chief Minister Pinarayi Vijayan Appreciates Stylish Star Allu Arjun

కరోనా నివారణ చర్యల్లో భాగంగా… అల్లు అర్జున్ తనవంతుగా కోటి 25 లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు రూ. 50 లక్షల చొప్పను, కేరళకు రూ. 25 లక్షలు అందజేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు బన్నీకి కేరళలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఇక బన్నీ చేసిన సాయానికి కేరళ పినరాయి విజయన్‌ ఆయనపై ప్రశంసలు కురిపించారు. కేరళ ప్రజలు ఆయనకు రుణపడి ఉంటారని…. తెలుగు రాష్ట్రాలతో సమానంగా కేరళకు కూడా సాయం అందించాలన్న బన్నీ ఆలోచన చాలా గొప్పగా ఉందని కొనియాడారు. ఇక గతంలో కూడా కేరళలో ప్రతిష్టాత్మక ‘నెహ్రూ ట్రోపీ బోట్ రేస్’కు బన్నీని సీఎం విజయన్‌ ప్రత్యేకంగా ఆహ్వానించి, సత్కరించిన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ తోనే అల్లు అర్జున్ సోషల్ మీడియాలో రికార్డ్స్ ను క్రియేట్ చేయడం మొదలు పెట్టాడు. ట్విట్టర్ లో అత్యధిక లైక్స్ అందుకున్న ఫస్ట్ లుక్ గా పుష్ప నిలిచింది. తెలుగు చిత్రాలలో ఎక్కువ ట్విట్టర్ లైక్స్ దక్కించుకున్న మూవీగా పుష్ప రికార్డు క్రియేట్ చేసింది. రష్మిక మందన్నహీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో.. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 16 =