
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 137


కొరటాల లిస్ట్ లో నాని, విజయ్ దేవరకొండ..!

నక్సలైట్ పాత్రలో..?
సచిన్ కు చిరంజీవి బర్త్ డే శుభాకాంక్షలు
నాగ్ అశ్విన్ కు "మహానటి" బర్త్ డే శుభాకాంక్షలు
ఛాలెంజ్ పూర్తి చేయలేను...అమ్మ తిడుతోంది..!
స్టైలిష్ బిజినెస్ మెన్ గా ఎన్టీఆర్

నాగచైతన్య ‘దోచెయ్’కు 5 ఏళ్ళు

నాగార్జున ‘ఆటోడ్రైవర్’కు 22 ఏళ్ళు
యన్టీఆర్ ‘ఆటగాడు’కు 40 ఏళ్ళు
దక్షిణాదికి మరో బాలీవుడ్ బ్యూటీ ?
పవన్ చిత్రంలో నివేత పెతురాజ్?
హాలీవుడ్ స్పూర్తితో ‘ప్రభాస్ 21’?
బాలయ్య 106 లాంచ్ అప్పుడే..!
సర్ నాకు తెలుసు 'బిజినెస్ మేన్ 2' ఎప్పుడు..?
కరోనా పై పోరాటంలో విజయం సాధిస్తాం - రష్మిక
విలన్ గా నటించడం నిజం కాదు - గోపీచంద్

దర్శకుడిగా 20 సంవత్సరాలు పూర్తి

మహేష్ కోసం కథ రాసే పనిలో విజయేంద్ర ప్రసాద్...!
ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ బాబు తర్వాత సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక మొదట వంశీ పైడిపల్లి తో సినిమా అన్నారు కానీ ఆ తర్వాత పరుశురాం పేరు తెరపైకి వచ్చింది. అంతేకాదు మే 31 న ఈ సినిమా లాంచింగ్ ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే.

కొరటాల లిస్ట్ లో నాని, విజయ్ దేవరకొండ..!
వరుస హిట్లతో తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు కొరటాల శివ. కెరీర్ మొదటి నుండి స్టార్ హీరో లతోనే చేసాడు. మొదటి సినిమా మిర్చి ప్రభాస్ తో, శ్రీమంతుడు, భారత అనే నేను మహేష్ తో, జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ తో ఇప్పుడు ఏకంగా చిరంజీవితోనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల చిరుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈసినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

నక్సలైట్ పాత్రలో..?
పెళ్ళైన తరువాత కొంత గ్యాప్ తీసుకున్న ప్రియమణి ఇప్పుడు వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటుంది. పాత్ర ప్రాధాన్యత వున్న పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది. ఇప్పటికే ప్రియమణి 'అసురన్' తెలుగు రీమేక్ నారప్ప సినిమాలో నటిస్తుంది. ఇప్పుడు ఇక ఇదిలా ఉండగా ప్రియమణి 'విరాట పర్వం' సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే.
సచిన్ కు చిరంజీవి బర్త్ డే శుభాకాంక్షలు
ఇంటర్నేషనల్ క్రికెటర్, మాజీ ఇండియన్ నేషనల్ క్రికెట్ టీమ్ కెప్టెన్ , హైయెస్ట్ రన్ స్కోరర్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ గా రికార్డ్ క్రియేట్ చేసిన సచిన్ టెండూల్కర్ బర్త్ డే సందర్భంగా రాజకీయ ప్రముఖులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, సాధారణ ప్రజలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
నాగ్ అశ్విన్ కు "మహానటి" బర్త్ డే శుభాకాంక్షలు
సూపర్ హిట్ "నేను శైలజ " మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన కీర్తి సురేష్ , నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ "మహానటి"మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ స్టార్ హీరోలతో నటించిన కీర్తి సురేష్ ఇప్పుడు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో ఎక్కువగా నటిస్తున్నారు.
ఛాలెంజ్ పూర్తి చేయలేను...అమ్మ తిడుతోంది..!
ప్రస్తుతం టాలీవుడ్ లో 'బి ది రియల్ మ్యాన్' ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో పలు స్టార్ హీరోలు పాల్గొని ఛాలెంజ్ ను పూర్తి చేశారు. చిరంజీవి నుండి వెంకటేష్, ఎన్టీఆర్, చరణ్ వంటి స్టార్స్ మరియు రాజమౌళి, కొరటాల శివ లాంటి డైరెక్టర్స్ ఈ ఛాలెంజ్ పూర్తి చేసి, రియల్ మెన్ అనిపించుకున్నారు. కానీ ఇక్కడ ఒక హీరో మాత్రం ఛాలెంజ్ ను పూర్తి చేయలేనని చెపుతున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు విజయ్ దేవరకొండ.
స్టైలిష్ బిజినెస్ మెన్ గా ఎన్టీఆర్
ఎటువంటి పాత్రనైనా తనదైన స్టైల్ లో రక్తి కట్టించే జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం" మూవీ లో ట్రైబల్ లీడర్ కొమరం భీమ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తున్నారని సమాచారం. "RRR"మూవీ తరువాత ఎన్టీఆర్ మరోమూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

నాగచైతన్య ‘దోచెయ్’కు 5 ఏళ్ళు
యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య పలు యాక్షన్ మూవీస్‌లో సందడి చేశాడు. వాటిలో ‘దోచెయ్’ ఒకటి. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి 'స్వామి రారా' ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. చైతుకి జోడిగా కృతి సనన్ నటించగా.. రావురమేష్, పోసాని కృష్ణమురళి, రవిబాబు, బ్రహ్మానందం, సన, పూజా రామచంద్రన్, చలపతిరావు, సప్తగిరి, ప్రియ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మధురిమ ప్రత్యేక గీతంలో మెరిసింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

నాగార్జున ‘ఆటోడ్రైవర్’కు 22 ఏళ్ళు
‘కింగ్’ నాగార్జునకు బాగా కలిసొచ్చిన నిర్మాతల్లో 'కామాక్షి మూవీస్' అధినేత డి.శివప్రసాద్ రెడ్డి ఒకరు. వీరిద్దరి కలయికలో వచ్చిన పలు చిత్రాలు మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. వాటిలో ‘ఆటోడ్రైవర్’ ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ సురేష్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాలో నాగార్జున సరసన దీప్తి భట్నాగర్(‘పెళ్లిసందడి’ ఫేమ్), సిమ్రన్ కథానాయికలుగా నటించారు. సుజాత, విజయ్ కుమార్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుధాకర్, బాబూమోహన్, రాజీవ్ కనకాల, రాళ్ళపల్లి, మహేష్ ఆనంద్, ధారాసింగ్, గుండు హనుమంతరావు, శివపార్వతి ముఖ్య పాత్రలు పోషించారు.
యన్టీఆర్ ‘ఆటగాడు’కు 40 ఏళ్ళు
మహానటుడు నందమూరి తారక రామారావు, అతిలోక సుందరి శ్రీదేవి.. టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ పెయిర్. ‘వేటగాడు’(1979)తో మొదలైన వీరి చిత్రప్రయాణం ‘వయ్యారిభామలు వగలమారిభర్తలు’(1982) వరకు సాగింది. వీటిలో పలు చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నవే కావడం విశేషం. కాగా, ‘వేటగాడు’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత వీరిద్దరి కలయికలో వచ్చిన రెండో చిత్రం `ఆటగాడు`. ‘యమగోల’ వంటి సక్సెస్‌ఫుల్ మూవీ తరువాత యన్టీఆర్, దర్శకుడు తాతినేని రామారావు కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర మూవీ క్రియేషన్స్ పతాకంపై జి.రాజేంద్రప్రసాద్ నిర్మించారు. ఇందులో కైకాల సత్యనారాయణ, రావుగోపాలరావు, అల్లు…
దక్షిణాదికి మరో బాలీవుడ్ బ్యూటీ ?
సూపర్ హిట్ "దమ్ లగాకే హైసా " మూవీ తో భూమి పెడ్నేకర్ బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. భూమి నటించిన "టాయిలెట్ - ఏక్ ప్రేమ్ కథ ", "శుభ్ మంగళ్ సావధాన్ ", "సాండ్ కి ఆంఖ్", "బాలా", "పతి పత్ని ఔర్ వో " మూవీస్ ఘనవిజయం సాధించాయి. "సాండ్ కి ఆంఖ్" మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన భూమి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.
పవన్ చిత్రంలో నివేత పెతురాజ్?
‘అల వైకుంఠపురములో’ చిత్రంతో మెగా కాంపౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నివేత పెతురాజ్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో..నివేత ఖాతాలో మరో రెండు మెగా మూవీస్ చేరాయని టాలీవుడ్ టాక్. బన్నీ హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప’లో సెకండ్ లీడ్‌గా ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో నివేత దర్శనమివ్వనుందని ఇప్పటికే వార్తలు వినిపిస్తుండగా.. తాజాగా మరో మెగా కాంపౌండ్ హీరో సినిమాలోనూ నటించే అవకాశాన్ని ఒడిసిపట్టుకుందని సమాచారం.
హాలీవుడ్ స్పూర్తితో ‘ప్రభాస్ 21’?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ రానున్న సంగతి తెలిసిందే. ‘ప్రభాస్ 21’గా రూపొందనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనుంది. 2021 ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో ప్రభాస్ ఓ సూపర్ హీరోలా కనిపిస్తాడని సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన వార్తొకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
‘కరోనా’పై అవగాహన కోసం పాట రాసి,పాడిన ‘కమల్'..!
రోజు రోజుకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్నో చర్యలు చేపడుతున్నాయి. ఇక ఈ చర్యల్లో భాగంగా ఇప్పటీకే ఎంతో మంది ప్రముఖులు ముందుకు వచ్చి విరాళాలు అందించారు.. ఇంకా అందిస్తూనే వున్నారు. ఇక సెలబ్రిటీస్ నుండి సామాన్య ప్రజలు వరకూ అందరూ ఇంట్లోనే ఉండాలని... కరోనా వైరస్ ను తరిమికొట్టాలని కోరుతున్నారు. దీనిలో భాగంగానే కరోనా పై అవగాహన కల్పించేందుకు ఇప్పటినే ఎంతోమంది పలు వీడియోలతో ముందుకొచ్చారు. ఇప్పుడు తాజాగా విలక్షణ నటుడు కమల్ కూడా ప్రజల్లో కారోనాపై అవగాహన కల్పించేందుకు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ఒక పాట పాడి విడుదల చేశారు.
బాలయ్య 106 లాంచ్ అప్పుడే..!
బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా.. రెండో షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్యను గతంలో ఎన్నడూ చూపించని డిఫరెంట్ షేడ్స్ లో బోయపాటి చూపించబోతున్నట్టు తెలుస్తుంది. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
సర్ నాకు తెలుసు 'బిజినెస్ మేన్ 2' ఎప్పుడు..?
'ఏయ్ నువ్వు నంద అయితే, నేను బద్రి.. బద్రీనాథ్.. అయితే ఏంటి? ఇరవై ఏళ్ళు అవుతున్నా ఈ డైలాగ్ కు ఉన్న.. సినిమాకు ఉన్న క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. ఈ రోజుకి ఈ సినిమా వచ్చి 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అటు హీరోగా పవన్ కెరీర్ అప్పటికే మంచి పీక్ లో వుంది.. అయితే డైరెక్టర్ గా పూరీ కు మాత్రం ఈసినిమా ఒక కీలక మలుపైంది. క్లాస్ సబ్జెక్టుకు.. పవన్ మాస్ మేనరిజమ్స్, స్టైలిష్ యాక్షన్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇక ఈ సినిమా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా హావానే నడిచింది ఈ రోజు. అటు పవన్ అభిమానులు, పూరీ, ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన రేణు దేశాయ్ ఇక చాలా మంది సెలెబ్రిటీస్ ఈ…
కరోనా పై పోరాటంలో విజయం సాధిస్తాం - రష్మిక
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రజలు ప్రాణ భయం తో కొట్టుమిట్టాడుతున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ కూడా కొనసాగుతుంది. పలువురు సినీ సెలబ్రిటీస్ ప్రజలకు కరోనా వైరస్ వ్యాప్తి నివారణ జాగ్రత్తలపై అవగాహన కలిపిస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న కన్నడ బ్యూటీ రష్మిక తన వంతుగా ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
విలన్ గా నటించడం నిజం కాదు - గోపీచంద్
"తొలి వలపు" మూవీ తో గోపీచంద్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తరువాత గోపీచంద్ ప్రతినాయకుడిగా నటించిన "జయం ", "వర్షం"మూవీస్ ఘనవిజయం సాధించాయి. గోపీచంద్ తిరిగి హీరోగా నటించిన "యజ్ఞం" మూవీ ఘనవిజయం సాధించడంతో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తున్నారు. గోపీచంద్ హీరోగా నటించిన రణం, లక్ష్యం, శౌర్యం, సాహసం, లౌక్యం, జిల్ మూవీస్ విజయం సాధించాయి.

నేను రిటైర్ అయ్యేంత వరకూ నువ్వు ఆరోగ్యంగా ఉండాలి..!
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'బద్రి' సినిమా అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో చెప్పనక్కర్లేదు. ఒక రకంగా పవన్ కు యూత్ లో మంచి క్రేజ్ ను తీసుకొచ్చిన సినిమా ఇది. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ రోజుతో 20 ఏళ్లు పూర్తయింది. దీనితో మరోసారి ఈ సినిమాను సోషల్ మీడియాలో గుర్తుచేసుకుంటున్నారు పవన్, పూరీ ఫ్యాన్స్. ఇప్పటికే రేణు దేశాయ్ ఈ సినిమా షూటింగ్ లో ఎంత కష్టపడిందో చెప్పుకొస్తూ... అప్పటి షూటింగ్ కు సంబంధించి కొన్ని రేర్ పిక్స్ ను అభిమానులతో పంచుకుంది.

దర్శకుడిగా 20 సంవత్సరాలు పూర్తి
సూపర్ హిట్ "బద్రి " మూవీ తో పూరి జగన్నాథ్ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, సూపర్, పోకిరి, దేశముదురు, చిరుత, బిజినెస్ మేన్, ఇద్దరమ్మాయిలతో, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ మూవీస్ ఘనవిజయం సాధించాయి.