ఛాలెంజ్ పూర్తి చేయలేను…అమ్మ తిడుతోంది..!

I Was Not Allowed To Do Work At Home Says Actor Vijay Deverakonda
I Was Not Allowed To Do Work At Home Says Actor Vijay Deverakonda

ప్రస్తుతం టాలీవుడ్ లో ‘బి ది రియల్ మ్యాన్’ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో పలు స్టార్ హీరోలు పాల్గొని ఛాలెంజ్ ను పూర్తి చేశారు. చిరంజీవి నుండి వెంకటేష్, ఎన్టీఆర్, చరణ్ వంటి స్టార్స్ మరియు రాజమౌళి, కొరటాల శివ లాంటి డైరెక్టర్స్ ఈ ఛాలెంజ్ పూర్తి చేసి, రియల్ మెన్ అనిపించుకున్నారు. కానీ ఇక్కడ ఒక హీరో మాత్రం ఛాలెంజ్ ను పూర్తి చేయలేనని చెపుతున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు విజయ్ దేవరకొండ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తన ఛాలెంజ్ ను పూర్తి చేసిన కొరటాల ఈ ఛాలెంజ్ ని హీరో విజయ్ దేవరకొండ కి విసిరారు.ఇక ఈ ఛాలెంజ్ పై స్పందించిన విజయ్ దేవరకొండ ‘ శివ సర్ మా అమ్మ నన్ను పని చేయనివ్వట్లేదు… పని డబుల్ అవుతుందట.. ఇంట్లో ఇంకా రియల్ మెన్ లా చూడట్లేదు… పిల్లల్లానే ట్రీట్ చేస్తున్నారు… అయితే లాక్ డౌన్ లోపు తనకు సంబందించిన ఓ వీడియో గ్లిమ్స్ విడుదల చేస్తాను అన్నాడు. మరి అన్నిటికి కాస్త భిన్నంగా స్పందించే విజయ్.. ఈ విషయం లో కూడా తన విభిన్నతను చూపించాడు. దీనికి కొరటాల శివ గారు ఏం రిప్లై ఇస్తారో చూద్దాం.

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + eighteen =