ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ బాబు తర్వాత సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక మొదట వంశీ పైడిపల్లి తో సినిమా అన్నారు కానీ ఆ తర్వాత పరుశురాం పేరు తెరపైకి వచ్చింది. అంతేకాదు మే 31 న ఈ సినిమా లాంచింగ్ ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా సినీ ప్రేక్షకులు గత కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ మహేష్ బాబు అండ్ రాజమౌళి. ఈ కాంబినేషన్ లో మూవీ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు అభిమానులకు. అయితే వారి కోరిక త్వరలోనే తీరబోయే రోజులు వచ్చేశాయి. ” RRR” సినిమా తరువాత మహేష్ బాబు హీరో గా మూవీ రూపొందించనున్నానని రాజమౌళి రీసెంట్ గా చెప్పిన సంగతి తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుందని.. ఈ మూవీ షూటింగ్ 2021 సంవత్సరం సెకండాఫ్ లో ప్రారంభం కానుందని రాజమౌళి తెలిపారు.
ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయట. ఇక తాజా సమాచారం ప్రకారం… మహేష్ బాబు, రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ మధ్య స్టోరీ డిస్కషన్స్ జరిగాయట. ఈ డిస్కషన్ లో మహేష్ తనకు స్పై థ్రిల్లర్ లాంటి కథ కావాలని చెప్పడంతో… రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ ఆ విధంగా కథను రాసే పనిలో పడ్డారట. పూర్తి స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత మరోసారి మహేష్ కు వినిపించనున్నారట. మొత్తానికి ఎన్నో ఏళ్ళ తర్వాత ఈ కాంబినేషన్ రాబోతుంది. మరి బొమ్మఈ రేంజ్ లో ఆడుతుందో.. ఏంటో
కాగా ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా “రౌద్రం రణం రుధిరం” అనే భారీ మల్టీ స్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే తుది దశకు చేరుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: