వరుస హిట్లతో తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు కొరటాల శివ. కెరీర్ మొదటి నుండి స్టార్ హీరో లతోనే చేసాడు. మొదటి సినిమా మిర్చి ప్రభాస్ తో, శ్రీమంతుడు, భారత అనే నేను మహేష్ తో, జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ తో ఇప్పుడు ఏకంగా చిరంజీవితోనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల చిరుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈసినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు యంగ్ హీరోలతో సినిమా చేయాలన్న ప్లాన్ లో వున్నాడట కొరటాల. కొరటాల తర్వాత లిస్ట్ లో న్యాచురల్ స్టార్ నాని, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఉన్నారట. ప్రస్తుతం వీరిద్దరితోనూ సంప్రదింపులు జరుపుతున్నాడట దర్శకుడు. అంతేకాదు తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే కొరటాల, నాని ,మాట్లాడుకున్నారని.. సినిమా ఓకే అయిందని ఆచార్య షూటింగ్ అయిపోయిన వెంటనే నాని సినిమా పట్టాలెక్కించడమే అన్న టాక్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు విజయ్ కు కూడా కథ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఏ హీరో చేస్తాడనేది మాత్రం ఆచార్య పూర్తయిన తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశం వుంది.
నిజానికి మొన్నటి వరకు రామ్ చరణ్ లేదా ఎన్టీఆర్‌లతో ఈయన సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి.కాని పెద్ద హీరోలతో సినిమా అంటే మళ్లీ ఏడాది అయినా వెయిట్ చేయాల్సి ఉంటుంది.వారు ఇద్దరు కూడా ఇతర ప్రాజెక్ట్‌లకు ఇప్పటికే కమిట్ అయ్యి ఉన్నారు. కనుక చిన్న హీరోతో సినిమా చేయాలనేది కొరటాల శివ ప్లాన్‌గా తెలుస్తోంది. చూద్దాం మరి అప్పటివరకూ ఏం జరుగుతుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: