
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 138

"పుష్ప "మూవీ సర్ ప్రైజింగ్ న్యూస్
మాస్ మహారాజా సరసన 'ఇస్మార్ట్' భామలు?

మరోసారి బన్నీ చిత్రంలో నివేత?

పూరీ జగన్నాథ్ తొలి చిత్రం ‘బద్రి’కి 20 వసంతాలు

పోలీస్ డిపార్ట్ మెంట్ సేవలపై దిల్ రాజు మూవీ
మహేష్ బాబు అభిమానులకు శుభవార్త
మహేష్ బాబుకు జోడీగా శ్రద్ధాకపూర్ ?
"మహావీర్ కర్ణ " మూవీ లో విక్రమ్
"గూఢచారి 2" మూవీ స్క్రిప్ట్ వర్క్ లో బిజీ

మెగాస్టార్ చిరంజీవి 'చిరంజీవి'కి 35 ఏళ్ళు

బాలకృష్ణ ‘సీతారామకళ్యాణం’కు 34 ఏళ్ళు
మరో రీమేక్‌లో సమంత?
చిరంజీవి సినిమాలో అల్లు అర్జున్?
'ఆచార్య' లో అవసరమైతే నేనుంటా అన్నారు..!
పెద్ద మనసు చాటుకుంటున్న 'దిల్' రాజు..!
"V" దర్శకుడికి నాని బర్త్ డే శుభాకాంక్షలు

దసరా పండగకు "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" రిలీజ్ ?
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలుగా GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, పూజాహెగ్డే జంటగా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆమని, ఈషా రెబ్బా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందించారు.

ప్రభాస్, త్రిష కాంబినేషన్ ఫిల్మ్ ‘పౌర్ణమి’కి 14 ఏళ్ళు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు కలిసొచ్చిన కథానాయికల్లో త్రిష ఒకరు. వీరిద్దరి కలయికలో ‘వర్షం’, ‘పౌర్ణమి’, ‘బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై’ వంటి చిత్రాలు తెరకెక్కాయి. వీటిలో డ్యాన్స్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ‘పౌర్ణమి’.. ఒక వర్గం ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ప్రభుదేవా డైరెక్షన్‌లో రూపొందిన ఈ మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌లో.. ఛార్మి మరో హీరోయిన్‌గా నటించింది. ముకేష్ రుషి, గీత, చంద్రమోహన్, మంజు భార్గవి, హర్షవర్ధన్, సింధు తులాని, తనికెళ్ళ భరణి, రాహుల్ దేవ్, కోట శ్రీనివాసరావు, సుబ్బరాజు, బ్రహ్మాజీ, సునీల్ ముఖ్య పాత్రలు పోషించారు.

నాగార్జున తొలి ద్విపాత్రాభినయ చిత్రం ‘హలోబ్రదర్’కి 26 ఏళ్ళు
‘కింగ్’ నాగార్జునకు అచ్చొచ్చిన దర్శకుల్లో ఇ.వి.వి.సత్యనారాయణ ఒకరు. వీరిద్దరి కలయికలో మూడు చిత్రాలు తెరకెక్కగా.. వాటిలో రెండు సినిమాలు ఘన విజయం సాధించాయి. అందులో ‘హలోబ్రదర్’ ఒకటి. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ గా రూపొందిన ఈ చిత్రం కోసం.. తొలిసారి ద్విపాత్రాభినయం చేసారు నాగార్జున. ఇందులో రమ్యకృష్ణ, సౌందర్య కథానాయికలుగా నటించగా.. శరత్‌బాబు, సంగీత, గిరిబాబు, సుధ, అన్నపూర్ణ, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, మల్లికార్జునరావు, బాబుమోహన్, అలీ, శ్రీహరి, నెపోలియన్, రాజనాల ముఖ్యభూమికలు పోషించారు. ఆమని, రంభ, ఇంద్రజ ప్రత్యేక గీతంలో కనువిందు చేశారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని…
"పుష్ప "మూవీ సర్ ప్రైజింగ్ న్యూస్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప"మూవీ రూపొందుతుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ లో చిత్తూరు యువకుడిగా అల్లు అర్జున్ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై రూపొందుతున్న "పుష్ప" మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మాస్ మహారాజా సరసన 'ఇస్మార్ట్' భామలు?
మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ రమేష్ వర్మ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నాడు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో రవితేజ రెండు విభిన్నమైన పాత్రల్లో దర్శనమివ్వనున్నాడని సమాచారం. కాగా, ఇందులో ఇద్దరు కథానాయికలకు స్థానముండగా.. ఇప్పటికే ఓ హీరోయిన్‌గా నిధి అగర్వాల్‌ని ఎంపిక చేసింది చిత్ర బృందం. తాజాగా మరో హీరోయిన్ రోల్ కోసం నభా నటేష్‌ని సెలెక్ట్ చేశారట. త్వరలోనే నభా ఎంట్రీపై క్లారిటీ రానుంది.

మరోసారి బన్నీ చిత్రంలో నివేత?
‘మెంటల్ మదిలో’(2017) చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక నివేత పెతురాజ్. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు పొందిన నివేత.. ఆ తరువాత ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాలతోనూ ఆకట్టుకుంది. అలాగే, ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫిల్మ్ ‘అల వైకుంఠపురములో’లో నటించే అవకాశాన్ని దక్కించుకోవడమే కాకుండా.. భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుందీ టాలెంటెడ్ బ్యూటీ. ప్రస్తుతం విడుదలకు సిధ్ధంగా ఉన్న రామ్, కిషోర్ తిరుమల కాంబో మూవీ ‘రెడ్’లోనూ నటించింది నివేత. ఇదిలా ఉంటే.. మరోసారి అల్లు అర్జున్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాన్నినివేత దక్కించుకుందని వార్తలు…

పూరీ జగన్నాథ్ తొలి చిత్రం ‘బద్రి’కి 20 వసంతాలు
కథానాయకులను కొత్తగా ఆవిష్కరించడంలో ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తీరే వేరు. ఆయన తెరకెక్కించిన ప్రతీ చిత్రంలోనూ ఇదే శైలిని కొనసాగించారు, కొనసాగిస్తున్నారు. అంతేకాదు.. తెలుగులో అన్ని వర్గాల కథానాయకులతోనూ సినిమాలు చేసిన వైనం పూరి సొంతం. అలాంటి పూరి దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘బద్రి’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో.. పవన్‌ను గత చిత్రాలకంటే డిఫరెంట్‌గా, పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేశారు పూరి. “నువ్వు నందా అయితే ఏంటి? నేను బద్రి.. బద్రీనాథ్” అని పవన్ చేత చెప్పించిన డైలాగ్ ఇప్పటికీ సంచలనమే. అలా ఫస్ట్ మూవీతోనే తను ఒక డిఫరెంట్ డైరెక్టర్ అని…

పోలీస్ డిపార్ట్ మెంట్ సేవలపై దిల్ రాజు మూవీ
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం కలవరపడుతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కట్టడికై ప్రపంచమంతా లాక్ డౌన్ పాటిస్తుంది. భారతదేశం లో కరోనా వ్యాప్తి నివారణకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర కృషి చేస్తున్నాయి. కరోనా మహమ్మారి పోరులో వైద్య బృందాలు, పోలీస్ శాఖ, పారిశుధ్య సిబ్బంది అహర్నిశలూ శ్రమిస్తున్నారు. సక్సెస్ ఫుల్ చిత్ర నిర్మాత దిల్ రాజు కరోనా పై పోలీస్ యుద్ధం నేపథ్యం లో ఒక మూవీ ని నిర్మిస్తానని తెలిపారు.
మహేష్ బాబు అభిమానులకు శుభవార్త
బ్లాక్ బస్టర్ "బాహుబలి ", "బాహుబలి 2" మూవీస్ తో ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా చాటిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్నమల్టీ స్టారర్ "రౌద్రం రణం రుధిరం"మూవీ 2021సంవత్సరం జనవరి 8వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తరువాత తన దర్శకత్వంలో రూపొందే మూవీ ని రాజమౌళి అనౌన్స్ చేశారు.
మహేష్ బాబుకు జోడీగా శ్రద్ధాకపూర్ ?
బ్లాక్ బస్టర్ "సరిలేరు నీకెవ్వరు" మూవీ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, బ్లాక్ బస్టర్ "గీత గోవిందం"మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందే మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ హీరోయిన్ గా కీర్తి సురేష్, కియారా అద్వానీ , మరికొంతమంది కథానాయిక ల పేర్లు వినిపించాయి. ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పేరు తెర పైకి వచ్చింది.
"మహావీర్ కర్ణ " మూవీ లో విక్రమ్
యునైటెడ్ ఫిల్మ్ కింగ్ డమ్ బ్యానర్ పై ఆర్ ఎస్ విమల్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ చియాన్ విక్రమ్ హీరోగా 300 కోట్ల బడ్జెట్ తో తమిళ, హిందీ భాషలలో "మహావీర్ కర్ణ " మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో కర్ణుడిగా విక్రమ్ నటిస్తున్నారు. హై టెక్నికల్ వేల్యూస్ తో పాన్ ఇండియా మూవీ గా "మహావీర్ కర్ణ " తెరకెక్కుతుంది.
"గూఢచారి 2" మూవీ స్క్రిప్ట్ వర్క్ లో బిజీ
శశి కిరణ్ దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "గూఢచారి" మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ కి సీక్వెల్ గా "గూఢచారి 2" మూవీ రూపొందనుంది. అడివి శేష్ హీరోగా రూపొందనున్న ఈ మూవీ కి "క్షణం", "గూఢచారి "మూవీస్ కి రైటర్ గా పనిచేసిన రాహుల్ పాకాల దర్శకుడు. లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయిన యాక్టర్, రైటర్ అడివి శేష్ "గూఢచారి 2" మూవీ స్క్రిప్ట్ వర్క్ లో బిజీ గా ఉన్నారు.

మెగాస్టార్ చిరంజీవి 'చిరంజీవి'కి 35 ఏళ్ళు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఫాదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. వాటిలో ‘చిరంజీవి’ ఒకటి. “తల్లి లేని కొడుకుని ప్రేమతో పెంచిన తండ్రి.. ఆ తండ్రి కోసం ప్రాణం ఇచ్చే కొడుకు”.. అలాంటి తండ్రీకొడుకుల మధ్య అనుకోని అవాంతరాలు ఎదురైతే ఎలా ఉంటుంది? అన్న కథాంశంతో తెరకెక్కిన సినిమానే ‘చిరంజీవి’. విజయశాంతి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో.. కైకాల సత్యనారాయణ, భానుప్రియ, మురళీమోహన్, నూతన్ ప్రసాద్, రంగనాథ్, అన్నపూర్ణ ముఖ్య పాత్రలు పోషించారు. కన్నడ మూవీ ‘నానే రాజా’కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు సి.వి.రాజేంద్రన్.

బాలకృష్ణ ‘సీతారామకళ్యాణం’కు 34 ఏళ్ళు
నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో పలు మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. వాటిలో ‘సీతారామకళ్యాణం’ ఒకటి. “హాస్యబ్రహ్మ” జంధ్యాల రూపొందించిన ఈ చిత్రంలో రజిని కథానాయికగా నటించగా.. జగ్గయ్య, గొల్లపూడి మారుతీరావు, రమాప్రభ, రామకృష్ణ, రాజేష్, శ్రీధర్, సంగీత, ముచ్చర్ల అరుణ, సుత్తివేలు, ‘శుభలేఖ’ సుధాకర్ ముఖ్య భూమికలు పోషించారు.
మరో రీమేక్‌లో సమంత?
గత కొంతకాలంగా రీమేక్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది టాలెంటెడ్ బ్యూటీ సమంత. మరీ ముఖ్యంగా.. నాయికా ప్రాధాన్యమున్న రీమేక్స్‌ను ఎంచుకుంటూ వార్తల్లో నిలుస్తోంది.`యూటర్న్`, `ఓ బేబీ`, ‘జాను’.. ఈ కోవకు చెందిన సినిమాలే. కట్ చేస్తే.. తాజాగా మరో ఫీమేల్ సెంట్రిక్ రీమేక్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట సామ్.

100 మిలియన్ల క్లబ్‌లో 'ఇస్మార్ట్' సాంగ్
ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్‘ చిత్రం.. బాక్సాఫీస్ ముంగిట ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ముఖ్యంగా “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ సంగీతం సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. ఇక పాటల విషయానికొస్తే.. “దిమాక్ ఖరాబ్” యువతను అమితంగా ఆకట్టుకుంది. రామ్, నభా నటేష్, నిధి అగర్వాల్ బృందంపై చిత్రీకరించిన ఈ ఊరమాస్ సాంగ్.. థియేటర్లలో ప్రేక్షకుల చేత స్టెప్పులు వేయించింది. కేవలం థియేటర్లలోనే కాదు యూట్యూబ్‌లోనూ ఈ గీతం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
చిరంజీవి సినిమాలో అల్లు అర్జున్?
మలయాళ బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’ చిత్రానికి సంబంధించిన తెలుగు రీమేక్ హక్కుల్ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించనున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ‘సాహో’ ఫేమ్ సుజీత్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని డైరెక్ట్ చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ రీమేక్ మూవీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా దర్శనమివ్వనున్నాడని సమాచారం.
'ఆచార్య' లో అవసరమైతే నేనుంటా అన్నారు..!
'ఆచార్య' లో మహేష్ బాబు.. గతకొద్ది కాలంగా పలు సైట్లలో నడుస్తున్న న్యూస్ ఇది. ఒకపక్క దీనిపై క్లారిటీ ఇస్తూనే ఉన్నా మరోపక్క ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తూనే ఉంది. ఇప్పటికే చిరు అసలు మహేష్ పేరు ఎలా వచ్చిందో తెలియట్లేదు... ఈ సినిమాలో ఓ పాత్రకు చరణ్ అయితే బావుంటదని కొరటాల శివకు మొదటినుండి ఉంది.. అయితే చరణ్ 'ఆర్ఆర్ఆర్' తో బిజీ గా వున్నాడు.. ఈ సినిమా కోసం డేట్స్ ఇవ్వడంపై మొదటి నుండి అనుమానం ఉంది...రాజమౌళి, కొరటాల ఒక అండర్ స్టాండింగ్ కు వస్తే... ఈ సినిమాలో చరణ్ ఉండొచ్చు అని ముందే చెప్పాడు.
పెద్ద మనసు చాటుకుంటున్న 'దిల్' రాజు..!
కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వం లాక్ డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ లాక్ డౌన్ వల్ల పేదలకు, రోజువారీ కూలీలకు ఆర్థికంగా.. తినడానికి కూడా ఇబ్బందులు పడుతున్న వారికి పలువురు ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు తమంతటతాముగా ముందుకొచ్చి విరాళాలు ప్రకటించారు.
"V" దర్శకుడికి నాని బర్త్ డే శుభాకాంక్షలు
దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి సూపర్ హిట్ "అష్టా చెమ్మా" మూవీ తో నాని ని టాలీవుడ్ కు హీరోగా పరిచయం చేశారు. వారిద్దరి కాంబినేషన్ లో రూపొందిన "జెంటిల్ మన్ " మూవీ ఘనవిజయం సాధించింది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన హీరో నాని సిల్వర్ జూబ్లీ మూవీ యాక్షన్ థ్రిల్లర్ "V" కరోనా కారణం గా విడుదల వాయిదా పడింది.