నేను రిటైర్ అయ్యేంత వరకూ నువ్వు ఆరోగ్యంగా ఉండాలి..!

Actor Vijay Deverakonda Recollects His Special Memory With Puri Jagannadh Debut Movie Badri
Actor Vijay Deverakonda Recollects His Special Memory With Puri Jagannadh Debut Movie Badri

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘బద్రి’ సినిమా అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో చెప్పనక్కర్లేదు. ఒక రకంగా పవన్ కు యూత్ లో మంచి క్రేజ్ ను తీసుకొచ్చిన సినిమా ఇది. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ రోజుతో 20 ఏళ్లు పూర్తయింది. దీనితో మరోసారి ఈ సినిమాను సోషల్ మీడియాలో గుర్తుచేసుకుంటున్నారు పవన్, పూరీ ఫ్యాన్స్. ఇప్పటికే రేణు దేశాయ్ ఈ సినిమా షూటింగ్ లో ఎంత కష్టపడిందో చెప్పుకొస్తూ… అప్పటి షూటింగ్ కు సంబంధించి కొన్ని రేర్ పిక్స్ ను అభిమానులతో పంచుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సందర్భంగా విజయ్ కూడా తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు. 20 ఏళ్ల కిందట నేను ఈ సినిమాను థియేటర్ లో చూసాను అప్పుడు నేను 6వ క్లాస్ చదువుతున్నా అనుకుంటా.. మళ్ళీ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ” ఏ చికీతా” పాట వింటున్నా అని ట్వీట్ చేసాడు. అంతేకాదు.. పూరీని.. షూటింగ్ ను కూడా మిస్ అవుతున్నానని… నటుడిగా నేను రిటైర్ అయ్యేంత వరకూ నువ్వు ఆరోగ్యంతో వుండాలని కోరుకుంటున్నానని పూరీ పై కాస్త కామెడీ చేసాడు.

కాగా విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ముంబై లో కొద్దిరోజులు షూటింగ్ ను జరుపుకోగా లాక్ డౌన్ వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తుంది. కాగా పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.