య‌న్టీఆర్‌ ‘ఆటగాడు’కు 40 ఏళ్ళు

NTR Blockbuster Movie Aatagadu Completes 40 Years.

మ‌హాన‌టుడు నంద‌మూరి తార‌క రామారావు, అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి.. టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ పెయిర్‌. ‘వేటగాడు’(1979)తో మొదలైన వీరి చిత్రప్ర‌యాణం ‘వయ్యారిభామలు వగలమారిభర్తలు’(1982) వరకు సాగింది. వీటిలో ప‌లు చిత్రాలు శ‌త‌దినోత్స‌వాలు జ‌రుపుకున్న‌వే కావ‌డం విశేషం. కాగా, ‘వేటగాడు’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత వీరిద్దరి కలయికలో వచ్చిన రెండో చిత్రం `ఆట‌గాడు`. ‘యమగోల’ వంటి సక్సెస్‌ఫుల్ మూవీ తరువాత య‌న్టీఆర్, ద‌ర్శ‌కుడు తాతినేని రామారావు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర మూవీ క్రియేషన్స్ పతాకంపై జి.రాజేంద్రప్రసాద్ నిర్మించారు. ఇందులో కైకాల సత్యనారాయణ, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, జగ్గయ్య, ప్రభాకరరెడ్డి, పద్మనాభం, నూతన్‌ప్రసాద్, మిక్కిలినేని, రావి కొండలరావు, చలపతిరావు, పుష్పలత ముఖ్య భూమికలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వేటూరి సుందరరామమూర్తి కలం నుంచి జాలువారిన పాటలకు.. చక్రవర్తి విన‌సొంపైన బాణీలు అందించారు. “జిల్ జిల్ జిలేబి”, “చీమ కుట్టిందా”, “చిలకమ్మ గూటిలో”, “నీ చూపు”, “ఏకో నారాయణా”.. ఇలా ప్ర‌తీ పాట‌ అప్పట్లో ప్రేక్షకులను అలరించింది. 1980 ఏప్రిల్ 24న విడుదలై శతదినోత్సవం జ‌రుపుకున్న ‘ఆటగాడు’.. నేటితో 40 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 7 =