ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 136
న్యూ స్కిల్స్ తో రాశీఖన్నా
ప్రభాస్ #21 లో నేను ఉన్నానా..?

మరో బయోపిక్ మూవీ ?
ఆస్కార్ అవార్డ్స్ పై రాజమౌళి స్పందన
నా కొడుకు నన్ను అక్కా అనే అంటాడు..!
నాకు అలాంటి అబ్బాయి నచ్చుతాడు..!
గ్లామర్ రోల్స్ కు సై - నివేత పేతురాజ్
బ్రదర్ నిన్ను చాలా మిస్ అవుతున్నా..!

పవన్ కళ్యాణ్ డైరెక్టోరియల్ ‘జాని’కి 17 ఏళ్ళు
‘ఆచార్య’లో సిస్టర్ సెంటిమెంట్?
వసూల్ సీజన్‌ను టార్గెట్ చేసుకున్న 'వకీల్ సాబ్'?
స్పై థ్రిల్లర్ మూవీ లో మహేష్ బాబు ?
సింగిల్ షెడ్యూల్లో ‘బంగార్రాజు’?
ప్రభాస్ సరసన కియారా అద్వాని?
నెగెటివ్ రోల్స్ చేయడానికి నేను రెడీ..!
'సాయం' లో కూడా సింప్లిసిటీ..!
న్యూ లుక్ లో హీరో రామ్
పలు రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీస్ లో స్మార్ట్ బాయ్ గా కనిపించిన రామ్ పోతినేని గడ్డంతో రఫ్ లుక్ తో కనిపించిన యాక్షన్ థ్రిల్లర్ "ఇస్మార్ట్ శంకర్" మూవీ ఘనవిజయం సాధించింది. అదే లుక్ తో రామ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ "RED" మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. హీరో రామ్ ఇప్పుడు క్లీన్ షేవ్ తో స్మార్ట్ లుక్ లో మారిపోయారు.
వచ్చే సంక్రాంతి లేదా రిపబ్లిక్ డేకి 'వకీల్ సాబ్'!
పవన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో 'వకీల్ సాబ్' గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. ఈ సినిమా చాలా వేగంగానే షూటింగ్ ను జరుపుకుంది. అయితే కరోనా వల్ల శరవేగంగా జరుపుకుంటున్న షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమాను మే 15న రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ... అది కూడా వాయిదా పడనుంది. లాక్ డౌన్ కనుక తీస్తే మిగిలిన షూటింగ్ ను కూడా తొందరలో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఒకవేళ ఈ సినిమా షూటింగ్ పూర్తయినా కూడా రిలీజ్ మాత్రం అప్పుడే లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. లాక్ డౌన్ తీసేసినా థియేటర్స్ మాత్రం ఇప్పుడప్పుడే ఓపెన్…
న్యూ స్కిల్స్ తో రాశీఖన్నా
సూపర్ హిట్ "ఊహలు గుస గుస లాడే" మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన రాశీఖన్నా బెంగాల్ టైగర్, సుప్రీమ్ , రాజా ది గ్రేట్, తొలిప్రేమ, వెంకీ మామ, ప్రతి రోజూ పండగే వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. కోలీవుడ్ లో కూడా రాశీ ఖన్నా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.
ఇప్పుడు పూరీ 'శివమణి' తీస్తే డైలాగ్స్ ఇలానే ఉండేవేమో..!
కింగ్ నాగార్జున, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన శివమణి సినిమా గుర్తుండే ఉంటది కదా. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. నాపేరు శివమణి నాకు కొంచెం మెంటల్.. అనే డైలాగ్ అప్పట్లో చాలా ఫేమస్. ఇప్పుడు సినిమా గురించి టాపిక్ ఎందుకొచ్చింది అంటే.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాను గుర్తుచేసుకున్నాడు కింగ్ నాగార్జున. అసలు సంగతేంటంటే..
ప్రభాస్ #21 లో నేను ఉన్నానా..?
నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం షూటింగ్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించాలని అనుకున్నారు. మరి అది ఎంత వరకూ సాధ్య పడుతుందో చూడాలి. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో మాళవిక నయర్ నటిస్తున్నట్టు కొందరు అభిప్రాయపడుతుండగా వాటిపై ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో నటి, యాంకర్ సునయన సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీస్ తో ఆన్ లైన్ లోనే ముచ్చటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా తను మాళవిక నయర్ తో మాట్లాడగా... అందులో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపింది. ఇక ఈ నేపథ్యంలో...మీరు ప్రభాస్ 21 సినిమాలో…

మరో బయోపిక్ మూవీ ?
"గీతాంజలి " మలయాళ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన కీర్తి సురేష్ అనతికాలంలోనే పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి టాలీవుడ్, కోలీవుడ్, మల్లు వుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ "మహానటి " లో సావిత్రి పాత్ర లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు. పలు మూవీస్ తో బిజీగా ఉన్న కీర్తి సురేష్ ఇప్పుడు మరో బయోపిక్ మూవీ లో నటించనున్నారని సమాచారం.
ఆస్కార్ అవార్డ్స్ పై రాజమౌళి స్పందన
మూవీ అవార్డ్స్ లో ఆస్కార్ అవార్డ్స్ కు ఒక ప్రత్యేకత ఉంది. మూవీ లోని పలు విభాగాలకు ఆస్కార్ అవార్డ్స్ అందజేయబడతాయి. 2020 సంవత్సరంలో "పారసైట్ " మూవీ ఉత్తమచిత్రం తోపాటు దర్శకుడు, స్క్రీన్ ప్లే విభాగాలలో ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకుంది. "పారసైట్ " మూవీ ని వీక్షించిన దర్శకుడు రాజమౌళి తనకు స్లో గా ఉండే మూవీస్ నచ్చవని, బోర్ కొట్టిందని, ఆ మూవీ చూస్తూ పడుకుండిపోయానని కామెంట్ చేశారు.
నా కొడుకు నన్ను అక్కా అనే అంటాడు..!
వెండి తెర, బుల్లి తెర.. తెర ఏదైనా... ఆర్టిస్ట్ అవ్వడం అనేది అందరికీ అంతా ఈజీ కాదు. బ్యాక్ గ్రౌండ్ ఉంటే పర్లేదు కానీ.. లేకుండా మాత్రం ఒక స్థాయికి రావాలంటే మాత్రం ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆలా వాటిని ధైర్యంగా ఎదుర్కొన్న వాళ్లే సక్సెస్ అవ్వగలరు. అలా ఎన్నో కష్టాలు ఎదుర్కొని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది సీరియల్ నటి రాగిణి. రాగిణి... సీరియల్స్ చూసే వారికి పరిచయం అక్కర్లేని పేరు. తల్లిగా, చెల్లిగా, వదినగా, విలన్ గా ఒకటి ఎన్నో పాత్రల్లో నటించిన రాగిణి ఒకటి కాదు రెండు కాదు దాదాపు 550 పైగా సీరియల్స్ లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక సినిమాల్లో కూడా 190 పైగా సినిమాల్లో…
నాకు అలాంటి అబ్బాయి నచ్చుతాడు..!
అమ్మాయిలను తనకు ఎలాంటి అబ్బాయి కావాలో అని అడిగితే చాలు ఓ పెద్ద లిస్టే చెపుతారు. అది మాములు అమ్మాయి అయినా.. సెలబ్రిటీ అయినా సరే. ఇక్కడ ఓ యంగ్ హీరోయిన్ కూడా తనకు ఎలాంటి అబ్బాయి నచ్చుతాడో అని అడిగితే పెద్ద లిస్టే చెప్పుకొచ్చింది. ఆ యంగ్ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా..? ఇంకెవరు బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. లాక్ డౌన్ వల్ల అందరూ ఇంట్లోనే వుంటున్నారు కదా. ఇక సెలెబ్రిటీస్ మాత్రం సోషల్ మీడియాద్వారా అభిమానులకు టచ్ లోనే వుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో ముచ్చటించిన పాయల్ కు.. మీకు ఎలాంటి అబ్బాయి అంటే నచ్చుతాడు అన్న ప్రశ్న అడుగగా... దానికి పాయల్ చాలా క్వాలిటీసే చెప్పింది. '…
గ్లామర్ రోల్స్ కు సై - నివేత పేతురాజ్
సక్సెస్ ఫుల్ "మెంటల్ మదిలో " మూవీ తో నివేత పేతురాజ్ టాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. సాంప్రదాయ బద్దంగా, పక్కింటి అమ్మాయిలా కనిపించే నివేత నటించిన "చిత్ర లహరి", "బ్రోచేవారెవరురా " మూవీస్ విజయం సాధించడం తో నటిగా గుర్తింపు పొందారు. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలకు అంగీకరించని నివేత బ్లాక్ బస్టర్ "అల వైకుంఠపురములో .." మూవీ లో గ్లామరస్ పాత్రలో కనిపించారు.
బ్రదర్ నిన్ను చాలా మిస్ అవుతున్నా..!
ఈ కరోనా వైరస్ ఏమో కానీ ఒక్కసారిగా ప్రపంచం మొత్తం ఇంటికే పరిమితమైంది. ఈ వైరస్ సంగతి పక్కన పెడితే.. ఇంటికి కుటుంబానికి కాస్త టైమ్ కూడా కేటాయించలేని.. బిజీ బిజీ జీవితం గడుపుతున్న వాళ్లకు మాత్రం నిజంగా ఇది గుడ్ టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే...ఈ రకంగా అయినా కాస్త కుటుంబంతో కలిసి గడిపే అవకాశం దక్కింది. ఇక నాణానికి ఇది ఒక కోణం అయితే మరో కోణం కొంత మంది ఇంటికి వెళ్లలేని పరిస్థితి. ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండాల్సిన పరిస్థితి. దీనితో చాలా మంది కుటుంబాలకు దూరంగా ఉంటూ బాధపడే వాళ్ళు కూడా వున్నారు. ఈ నేపథ్యంలో ఒక స్టార్ హీరోయిన్ కూడా ఈ లాక్ డౌన్ వల్ల తన బ్రదర్ ను బాగా మిస్ అవుతుందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు తమన్నా.

పవన్ కళ్యాణ్ డైరెక్టోరియల్ ‘జాని’కి 17 ఏళ్ళు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు పవన్. హీరోగా కెరీర్ ఆరంభంలో వరుస బ్లాక్ బస్టర్ మూవీస్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న పవన్.. అదే జోరులో మెగాఫోన్ పట్టి దర్శకుడిగానూ అలరించే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నానికి తెరరూపమే.. ‘జాని’. ‘బద్రి’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ జంటగా నటించిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాలో గీత, రఘువరన్, అలీ, బ్రహ్మాజీ, ఎం.ఎస్.నారాయణ, మల్లికార్జునరావు, రాజామురాద్ ముఖ్య భూమికలు…
‘ఆచార్య’లో సిస్టర్ సెంటిమెంట్?
‘ఖైదీ నంబర్ 150’, ‘సైరా నరసింహారెడ్డి’ వంటి ఘనవిజయాల తరువాత మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘ఖైదీ నంబర్ 150’ తరువాత చిరుకి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనుండగా.. మెగా ప్రిన్సెస్ నిహారికా కొణిదెల అతిథి పాత్రలో దర్శనమివ్వనుందని సమాచారం.

నెటిజన్స్ కామెంట్స్.. అది నా పర్సనల్ ఒపీనియన్ అంటున్న జక్కన్న..!
ఒక సినిమా అందరికీ నచ్చాలని లేదు. కొంతమందికి నచ్చితే.. అదే సినిమా ఇంకొంతమందికి నచ్చకపోవచ్చు. ఎవరి సొంత అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయి. అలా దర్శక ధీరుడు రాజమౌళికి తన ఒపీనియన్ ను చెప్పడం ఇప్పుడు తప్పయింది కొంతమంది నెటిజన్స్ కు. అసలు సంగతేంటంటే... ఆస్కార్ అవార్డ్ పొందిన పారాసైట్ చిత్రం చూసిన రాజమౌళి దానిపై కాస్త వెటకారంగానే కామెంట్స్ చేశాడు. ఆ సినిమా చూస్తున్నంత సేపు బోరింగ్ ఫీలింగ్ కలిగిందని, చూస్తూ అలానే పడుకుండిపోయానని చెప్పుకొచ్చారు. అంతేకాదు నాకు స్లోగా ఉండే సినిమాలు నచ్చవని కామెంట్స్ చేశారు. ఇక అంతే ఇది చూసిన కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ మీద కామెంట్స్ వదిలారు.
వసూల్ సీజన్‌ను టార్గెట్ చేసుకున్న 'వకీల్ సాబ్'?
తెలుగు సినిమాకు సంబంధించినంత వరకు సంక్రాంతి సీజన్‌ని వసూల్ సీజన్‌గా చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో విడుదలైన పలు చిత్రాలు భారీ స్థాయిలో కాసుల వర్షం కురిపించడమే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది ముగ్గుల పండక్కి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశాయి. ఈ నేపథ్యంలోనే.. వచ్చే సంక్రాంతికి మరో క్రేజీ ప్రాజెక్ట్ సందడి చేయనుందని తెలుస్తోంది. ఆ చిత్రమే.. ‘వకీల్ సాబ్’.
స్పై థ్రిల్లర్ మూవీ లో మహేష్ బాబు ?
బ్లాక్ బస్టర్ "భరత్ అనే నేను" , "మహర్షి " , "సరిలేరు నీకెవ్వరు" వంటి మూవీస్ తో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబు తన తరువాత మూవీ దర్శకుడు పరశురామ్ తో చేయనున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఒక మూవీ ని అనౌన్స్ చేశారు. ఈ మూవీ స్పై థ్రిల్లర్ గా రూపొందనుందని, స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారని సమాచారం.
సింగిల్ షెడ్యూల్లో ‘బంగార్రాజు’?
2016 సంక్రాంతికి విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయనా’ పొంగల్ విన్నర్‌గా నిలవడమే కాకుండా.. ‘కింగ్’ నాగార్జున కెరీర్లోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సోషియో ఫాంటసీ మూవీకి సీక్వెల్ ప్లాన్ జరుగుతోంది. ‘బంగార్రాజు’ పేరుతో తెరకెక్కనున్న ఈ కొనసాగింపు చిత్రంలో నాగ్‌తో పాటు ఆయన తనయుడు యువ సామ్రాట్ నాగచైతన్య కూడా నటించబోతున్నాడు. ‘సోగ్గాడే..’ని డైరెక్ట్ చేసిన కళ్యాణ్ కృష్ణనే ఈ సీక్వెల్‌ని కూడా తీర్చిదిద్దనున్నాడు.
ప్రభాస్ సరసన కియారా అద్వాని?
‘భరత్ అనే నేను’తో తెలుగుతెరకు కథానాయికగా పరిచయమైంది ఉత్తరాది భామ కియారా అద్వాని. తొలి చిత్రంతోనే ఘనవిజయాన్ని చవిచూసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ఆపై ‘వినయ విధేయ రామ’లోనూ నాయికగా సందడి చేసింది. ఈ రెండు చిత్రాల్లోనూ అగ్ర కథానాయకులతోనే జట్టుకట్టింది కియారా. ‘భరత్ అనే నేను’లో సూపర్ స్టార్ మహేష్ బాబుతోనూ, ‘వినయ విధేయ రామ’లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తోనూ ఆడిపాడింది. తదనంతరం బాలీవుడ్ పైనే దృష్టిపెట్టిన ఈ సొగసరి త్వరలో మరో తెలుగు చిత్రంలో నటించబోతోందని సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈసారి కూడా స్టార్ హీరోతోనే చిందులేయనుందట.
నెగెటివ్ రోల్స్ చేయడానికి నేను రెడీ..!
నరేష్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ 'నాంది' అనే డిఫరెంట్ స్టోరీ తో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇటీవలే ముగిసింది. రెండవ షెడ్యూల్ షూటింగును ఈ రోజున మొదలెట్టారు.అయితే ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల షూట్ కు బ్రేక్ పడింది. కాగా ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సతీష్ వేగేశ్న నిర్మిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
'సాయం' లో కూడా సింప్లిసిటీ..!
టాలీవుడ్ డైరెక్టర్స్ లో శేఖర్ కమ్ముల స్టైల్ వేరని ప్రేత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్ద హడావుడి లేకుండా చాలా సింపుల్ గా ఉంటాడు. ఆయన సినిమాలు సహజత్వాన్ని చాలా దగ్గరగా ఉంటాయి. ఇక ఇదిలా ఉండగా సాయం చేయడంలో కూడా ఆయన తన సింప్లిసిటీ చూపించాడు.