సర్ నాకు తెలుసు ‘బిజినెస్ మేన్ 2’ ఎప్పుడు..?

‘ఏయ్‌ నువ్వు నంద అయితే, నేను బద్రి.. బద్రీనాథ్‌.. అయితే ఏంటి? ఇరవై ఏళ్ళు అవుతున్నా ఈ డైలాగ్ కు ఉన్న.. సినిమాకు ఉన్న క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. ఈ రోజుకి ఈ సినిమా వచ్చి 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అటు హీరోగా పవన్ కెరీర్ అప్పటికే మంచి పీక్ లో వుంది.. అయితే డైరెక్టర్ గా పూరీ కు మాత్రం ఈసినిమా ఒక కీలక మలుపైంది. క్లాస్ సబ్జెక్టుకు.. పవన్ మాస్ మేనరిజమ్స్, స్టైలిష్ యాక్షన్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇక ఈ సినిమా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా హావానే నడిచింది ఈ రోజు. అటు పవన్ అభిమానులు, పూరీ, ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన రేణు దేశాయ్ ఇక చాలా మంది సెలెబ్రిటీస్ ఈ సినిమా ను గుర్తుచేసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు. మీ సినీ ప్రయాణంలో నేను కూడా భాగమైనందుకు చాలా హ్యాపీగా వుంది.. థ్యాంక్స్ ఫర్ ‘బిజినెస్ మేన్ ‘.. నాకు తెలుసు మీరు ‘బిజినెస్ మేన్ 2’ తీయడానికి రెడీ గా వున్నారని.. త్వరలోనే కలిసి చేద్దాం సర్ అంటూ ట్వీట్ చేసాడు. మొతానికి ట్వీట్ సంగతేమో కానీ.. పూరీ బిజినెస్ మెన్ 2 తీసే ప్లాన్ లో ఉన్నడన్న హింట్ ఇచ్చాడు. మరి బిజినెస్ మెన్ ను మహేష్ తో తీశాడు.. సెకండ్ పార్ట్ ఎవరితో తీస్తాడో చూద్దాం. ప్రస్తుతం వరుస సినిమాలతో… సూపర్ హిట్ ఆడియోస్ తో టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ లో దూసుకుపోతున్నాడు థమన్.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.