విలన్ గా నటించడం నిజం కాదు – గోపీచంద్

Actor Gopichand Quashes Rumours Of Playing Villain In Rajinikanth Annaatthe Movie

“తొలి వలపు” మూవీ తో గోపీచంద్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తరువాత గోపీచంద్ ప్రతినాయకుడిగా నటించిన “జయం “, “వర్షం”మూవీస్ ఘనవిజయం సాధించాయి. గోపీచంద్ తిరిగి హీరోగా నటించిన “యజ్ఞం” మూవీ ఘనవిజయం సాధించడంతో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తున్నారు. గోపీచంద్ హీరోగా నటించిన రణం, లక్ష్యం, శౌర్యం, సాహసం, లౌక్యం, జిల్ మూవీస్ విజయం సాధించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సన్ పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ హీరోగా “అన్నాత్తే ” తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ ముఖ్య పాత్రలలో నటిస్తుండగా , విలన్ పాత్ర కై గోపీచంద్ ఎంపిక అయ్యారని వార్తలు వచ్చాయి. ఈసందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ .. రజనీకాంత్ మూవీ లో విలన్ గా నటించడమనే వార్త నిజం కాదని, దర్శకుడు శివ తనకు మంచి ఫ్రెండ్ అని, తమ ఇద్దరి కాంబినేషన్ లో ” శౌర్యం”, “శంఖం ” మూవీస్ రుపొందాయని, “అన్నాత్తే ” మూవీ తరువాత దర్శకుడు శివ తమ ఇద్దరి కాంబినేషన్ మూవీ కొరకు స్క్రిప్ట్ రెడీ చేయనున్నారని గోపీచంద్ తెలిపారు. గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది నంది దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్” మూవీ లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − four =