నక్సలైట్ పాత్రలో..?

Actress Priyamani Plays Naxalite In Virata Parvam
Actress Priyamani Plays Naxalite In Virata Parvam

పెళ్ళైన తరువాత కొంత గ్యాప్ తీసుకున్న ప్రియమణి ఇప్పుడు వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటుంది. పాత్ర ప్రాధాన్యత వున్న పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది. ఇప్పటికే ప్రియమణి ‘అసురన్’ తెలుగు రీమేక్ నారప్ప సినిమాలో నటిస్తుంది. ఇప్పుడు ఇక ఇదిలా ఉండగా ప్రియమణి ‘విరాట పర్వం’ సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇంతవరకూ 70 శాతం చిత్రీకారణ పూర్తి చేసుకోగా ప్రస్తుతం షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమాలో ప్రియమణి నటిస్తున్నట్టు.. అది కూడా నక్సలైట్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రియమణిపై యాక్షన్ సీన్స్ కూడా వున్నాయట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

కాగా ఇంకా ఈసినిమాలో నందితా దాస్, ప్రియమణి, ఈశ్వరీ రావ్‌,జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. 1990 ల నాటి సామజిక పరిస్థితుల ఆధారం గా రూపొందుతున్న ఈ మూవీని ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా రానా.. నక్సలైట్ గా సాయిపల్లవి కనిపించనున్నట్టు తెలుస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − eleven =