నాగార్జున ‘ఆటోడ్రైవర్’కు 22 ఏళ్ళు

Akkineni Nagarjuna Comedy Entertainer Auto Driver Completes 22 Years

‘కింగ్’ నాగార్జున‌కు బాగా క‌లిసొచ్చిన నిర్మాత‌ల్లో ‘కామాక్షి మూవీస్’ అధినేత డి.శివ‌ప్ర‌సాద్ రెడ్డి ఒకరు. వీరిద్దరి కలయికలో వ‌చ్చిన ప‌లు చిత్రాలు మ్యూజిక‌ల్ హిట్స్‌గా నిలిచాయి. వాటిలో ‘ఆటోడ్రైవర్’ ఒక‌టి. టాలెంటెడ్ డైరెక్టర్ సురేష్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాలో నాగార్జున సరసన దీప్తి భట్నాగర్(‘పెళ్లిసందడి’ ఫేమ్), సిమ్రన్ కథానాయికలుగా నటించారు. సుజాత, విజయ్ కుమార్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుధాకర్, బాబూమోహన్, రాజీవ్ కనకాల, రాళ్ళపల్లి, మహేష్ ఆనంద్, ధారాసింగ్, గుండు హనుమంతరావు, శివపార్వతి ముఖ్య పాత్రలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వేటూరి సుందరరామమూర్తి, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సాహిత్యం సమకూర్చగా.. దేవా బాణీలు అందించారు. వాటిలో “చందమామ”, “మామా మజారే”, “అక్కినేని అక్కినేని.. యువ‌సామ్రాట్ హీరోవే”, “అబ్బాయ్ అబ్బాయ్‌”, “ఏమో ఏమో” వంటి పాటలు అక్కినేని అభిమానులను అలరించాయి. 1998 ఏప్రిల్ 24న విడుదలైన ‘ఆటోడ్రైవర్’.. నేటితో 22 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − one =