సూపర్ హిట్ “నేను శైలజ ” మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన కీర్తి సురేష్ , నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ “మహానటి”మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ స్టార్ హీరోలతో నటించిన కీర్తి సురేష్ ఇప్పుడు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో ఎక్కువగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు నాగ్ అశ్విన్ బర్త్ డే సందర్భంగా నిన్న (23వ తేదీ ) కీర్తి సురేష్ శుభాకాంక్షలు తెలిపారు. అసాధారణ, కూల్, ఫన్నీ, క్రేజీ, ట్యాలెంటెడ్ వ్యక్తులలో నాగ్ అశ్విన్ ఒకరు అంటూ ప్రశంసలు కురిపిస్తూ తామిద్దరి ఫోటో ను కీర్తి సురేష్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన “మిస్ ఇండియా”, “గుడ్ లక్ సఖి” (తెలుగు ), “మరక్కార్” (మలయాళ ) , “పెంగ్విన్ “(తమిళ ) మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. నితిన్ హీరోగా రూపొందుతున్న “రంగ్ దే” , రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న “అన్నాత్తే ” మూవీస్ లో కీర్తి సురేష్ నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: