నాగచైతన్య ‘దోచెయ్’కు 5 ఏళ్ళు

Akkineni Naga Chaitanya Action Thriller Movie Dochay Turns 5

యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య పలు యాక్షన్ మూవీస్‌లో సంద‌డి చేశాడు. వాటిలో ‘దోచెయ్’ ఒకటి. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. చైతుకి జోడిగా కృతి సనన్ నటించగా.. రావురమేష్, పోసాని కృష్ణమురళి, రవిబాబు, బ్రహ్మానందం, స‌న‌, పూజా రామచంద్రన్, చలపతిరావు, సప్తగిరి, ప్రియ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మధురిమ ప్రత్యేక గీతంలో మెరిసింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కృష్ణచైతన్య, శ్రీమణి, కృష్ణకాంత్ గీత రచనకు సన్నీ ఎం.ఆర్ స్వరాలు సమకూర్చాడు. వాటిలో “ఒక్కరికి ఒక్కరం”, “రానా” వంటి పాటలు అక్కినేని అభిమానుల‌ను అలరించాయి. 2015 ఏప్రిల్ 24న విడుదలైన ‘దోచెయ్’.. నేటితో ఐదేళ్లను పూర్తిచేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.