కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 133

సినిమా వార్తలు

అలాంటి పాత్రలలో నటించను - రాశీఖన్నా

టాలీవుడ్ , కోలీవుడ్ లలో అందాల రాశీఖన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. నటి, మోడల్ , సింగర్ రాశీఖన్నా సూపర్ హిట్ "బెంగాల్ టైగర్ ", "జై లవకుశ", "తొలి ప్రేమ", "ప్రతి రోజు పండగే" మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన "వరల్డ్ ఫేమస్ లవర్" మూవీలో హీరోయిన్ గా నటించిన రాశీఖన్నా కొన్ని బోల్డ్ సీన్స్ లో నటించడంతో వివాదాస్పదం అయ్యింది. అభిమానులు షాక్ కు గురి అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బర్త్ డే కి సమంత కొత్త నిర్ణయం..!

ఒక షుగర్ పేషెంట్ గా అయినా.. పల్లటూరి పిల్ల అయినా.. నత్తి గా మాట్లాడే పాత్ర అయినా.. ఏపాత్ర అయినా సరే దానికి కరెక్ట్ జస్టిఫై చేసే హీరోయిన్ ఎవరైనా వున్నారంటే ఈ తరం కథానాయికలలో అది సమంత అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏం మాయ చేశావే సినిమాతో సినీ పరిశ్రలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ దక్కించుకొని ఆ తర్వాత నుండి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 'బృందావనం', 'దూకుడు', 'ఈగ', సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', ఇలా వరుస హిట్స్ తో గోల్డెన్ లెగ్ అయిపోయింది. ఏదో సినిమా చేసాం అయిపోయింది అన్నట్టు కాకుండా.. పాత్ర పాత్ర కు తన వైవిధ్యతను చూపించుకుంటూ ఒక నటిగా తానేంటో నిరూపించుకుంటూ…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రకుల్ ప్రీత్ కరోనా చిట్కాలు

కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ తో ప్రజలంతా ఇళ్ళకే పరిమితం అయ్యారు. ప్రాణాంతక కరోనా వ్యాప్తి నివారణకు స్వీయ గృహ నిర్బంధం తోపాటు వ్యాధి నిరోధక శక్తి ని కూడా బలోపేతం చేసుకొనడం ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

‘ఫైట‌ర్’ కోసం సెంటిమెంట్‌ ఫాలో అవుతున్న పూరీ జ‌గ‌న్నాథ్‌?

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఒక్కో ద‌ర్శ‌కుడికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ముఖ్యంగా టైటిల్స్ విష‌యంలో. “క‌ళాత‌ప‌స్వి” కె.విశ్వనాథ్‌, భీమ‌నేని శ్రీ‌నివాసరావుకు ‘స‌’,’శ‌’ అక్ష‌రాలు.. సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌కు ‘అ’ అనే అక్షరం టైటిల్స్‌లో ప్రథమాక్షరంగా చాలా సంద‌ర్భాల్లో క‌లిసిరాగా.. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు తేజ‌కు టైటిల్ చివ‌ర‌లో ‘పూర్ణాక్ష‌రం’ (‘చిత్రం’, ‘జయం’.. ఇలా) ఉండ‌డం అచ్చొచ్చింది. వీరిలాగే ‘ఇస్మార్ట్’ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌కి కూడా త‌న సినిమాల టైటిల్స్‌ విషయంలో ఓ సెంటిమెంట్ ఉంది.

Team TFNవాట్సాప్
Akkineni Nageswara Rao Musical Blockbuster Pelli Kanuka Completes 60 Years.
సినిమా వార్తలు

అక్కినేని నాగేశ్వరరావు ‘పెళ్లికానుక’కి 60 ఏళ్ళు

మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు కెరీర్‌లో పలు మ్యూజిక‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్ ఉన్నాయి. వాటిలో ‘పెళ్లికానుక’ ఒకటి. దర్శకుడు సి.వి.శ్రీధర్ రూపొందించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఏయన్నార్‌కు జోడిగా బి.సరోజా దేవి, కృష్ణకుమారి నటించారు. జగ్గయ్య, గుమ్మడి, రేలంగి, గిరిజ, కె.మాలతి, మాస్టర్ బాబు ముఖ్య భూమికలు పోషించారు. తమిళ చిత్రం ‘కళ్యాణ పరిశు’(1959)కు రీమేక్‌గా ఈ సినిమాను తెర‌కెక్కించారు దర్శకుడు.

Team TFNవాట్సాప్
Vaishnav Tej Debut Movie Uppena To Hit Theatres In December
సినిమా వార్తలు

"ఉప్పెన " మూవీ డిసెంబర్ రిలీజ్

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా "ఉప్పెన " మూవీ రూపొందింది. సక్సెస్ ఫుల్ తమిళ చిత్ర హీరో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిన్న సినిమా అయినా భారీ బడ్జెట్ తో రూపొందిన "ఉప్పెన " మూవీ విజయం పై నిర్మాతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరోయిన్ల‌ విషయంలో సేమ్ స్ట్రాట‌జీ ఫాలో అవుతున్న సుకుమార్

వైవిధ్యభ‌రితమైన చిత్రాల‌కు చిరునామాగా నిలిచిన ద‌ర్శ‌కుల్లో బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ ఒక‌రు. మొదటి సినిమా ‘ఆర్య’ నుండి గత చిత్రం ‘రంగస్థలం’ వరకు నవ్యతకే పెద్దపీట వేశారాయన. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ‘పుష్ప’ కూడా అదే బాటలో వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. సుకుమార్ సినిమాలను గమనిస్తే ఓ విషయం స్పష్టమవుతుంది. అదేమిటంటే.. ఆయన చిత్రాల‌న్నీ 'సింగిల్ హీరోయిన్' సబ్జెక్టులే కావడం.

Team TFNవాట్సాప్
Mega Star Chiranjeevi Socio Fantasy Movie Yamudiki Mogudu Completes 32 Years.
సినిమా వార్తలు

మెగాస్టార్ చిరంజీవి సోషియో-ఫాంట‌సీ ఫిల్మ్ ‘యముడికి మొగుడు’కి 32 ఏళ్ళు

మెగాస్టార్ చిరంజీవికి సోషియో ఫాంటసీ మూవీస్ బాగా కలిసొచ్చాయి. ‘యముడికి మొగుడు’, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ వంటి సినిమాలు ఈ కోవకు చెందినవే. వీటిలో ‘యముడికి మొగుడు’కి ప్రత్యేక స్థానముంది. ఎందుకంటే.. ‘పసివాడి ప్రాణం’(1987)లాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత మళ్ళీ చిరు కెరీర్‌లో అటువంటి విజ‌యాన్ని అందించింది ‘యముడికి మొగుడు’. అంతేకాదు.. చిరు తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ చేసిన సోషియో – ఫాంటసీ బ్యాక్ డ్రాప్ ఫిల్మ్ కూడా ఇదే కావ‌డం విశేషం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సోషల్ మీడియాలోకి రావడానికి అదే కారణం..!

మెగా స్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఇటీవలే ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే చిరు ఎంట్రీ అయితే లేట్ అయిందేమో కానీ.. ఆయన మాత్రం కరెక్ట్ టైంలోనే ఎంట్రీ ఇచ్చారు. అసలే లాక్ డౌన్. షూటింగ్ లు లేవు. ఇంట్లోనే ఉండాలి. ఇలాంటి టైం సోషల్ మీడియా లోకి ఎంట్రీ ఇచ్చి పలు విషయాలను తన వీడియోల ద్వారా పంచుకుంటున్నారు. కరోనా పై అవగాహనా కల్పించే వీడియోస్ దగ్గర నుండి.. తన వ్యక్తిగత జీవితం వరకూ అన్ని విషయాలను ఎప్పటికప్పుడు తెలియచేస్తూనే ఉన్నారు. ఒకరకంగా యంగ్ హీరోస్ కూడా అంత యాక్టీవ్ గా లేరు. చిరు మాత్రం ప్రతి విషయాన్ని అప్ డేట్ ఇస్తూ.. కొన్నిసార్లు సప్సెన్స్ క్రియేట్ చేస్తూ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతున్నారు.

TFN Adminవాట్సాప్
This Hit Pair Sets A Unique Record For Playing The Lead Role In 107 Movies
సినిమా వార్తలు

107 సినిమాల్లో కలిసి నటించిన హీరో-హీరోయిన్..!

వెండి తెరపై కొన్ని కొన్ని కాంబినేషన్స్ అలా సెట్ అయిపోతాయి. అది హీరో - హీరోయిన్ అవ్వొచ్చు, డైరెక్టర్-హీరో, డైరెక్టర్-నిర్మాత ఇలా ఎవరైనా అవ్వొచ్చు. కొన్ని కాంబినేషన్స్ మాత్రం అలా వర్క్ అవుట్ అవుతాయి. ఇక హీరో హీరోయిన్స్ కాంబినేషన్స్ కు వస్తే పాత తరం నుండి ఈ తరం వరకూ కొన్ని హిట్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇప్పటితో పోల్చుకుంటే.. పాత తరంలో కాస్త హీరోయిన్స్ తక్కువ కాబట్టి కాంబినేషన్స్ రిపీట్ అవుతూనే ఉండేవి. ఆ తరువాత మన అగ్ర హీరోలు కూడా ఒక్కో హీరోయిన్ తో బాగానే సినిమాలు తీశారు. చిరు రాధ, చిరు విజయశాంతి, చిరు రాధిక వీరి కాంబినేషన్స్ లో చాలా సినిమాలే వచ్చాయి. కమల్ హాసన్ శ్రీదేవి కాంబినేషన్ లో కూడా ఎన్నో…

TFN Adminవాట్సాప్
Naveen Polishetty Clarifies about Balakrishna Boyapati Film
సినిమా వార్తలు

బాలకృష్ణ సినిమాలో నేను లేను..!

బాలయ్య తో బోయపాటి సినిమా మొదలైన దగ్గరనుండి ఏదో ఒక వార్త తెరపైకి వస్తూనే ఉంది. ఇప్పటికే బాలయ్య పాత్రపై, హీరోయిన్ పై ఇలా పలు విషయాలపై చిత్రయూనిట్ క్లారిటీ ఇస్తూనే వుంది. ఇదిలా ఉండగా తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. అదేంటంటే.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హిట్ కొట్టి.. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి కూడా బాలకృష్ణ సినిమాలో నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. బాలయ్య పాత్రకు అసిస్టెంట్ గా చాలా కీలకమైన రోల్ ఒకటి ఉండగా.. దాని కొరకు ఆయనని తీసుకున్నారని.. రెండు రోజులుగా ఈ వార్త ప్రచారం అవుతుంది. అయితే ఇప్పుడు ఆ వార్తలను ఖండించాడు నవీన్.

TFN Adminవాట్సాప్
Rashmika Mandanna funny q & a with fans
సినిమా వార్తలు

రష్మిక మీ భర్త కావాలని ఉంది.. అయితే అతడి అనుమతి తీసుకోవాలి..!

కరోనా వల్ల సినిమా సెలెబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇక సోషల్ డిస్టెన్స్ అయితే వుంది కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులకు ఎప్పటికప్పుడు దగ్గరగానే వుంటున్నారు. వాళ్ళతో లైవ్ ల ద్వారా మాట్లాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రష్మిక కూడా తన అభిమానులతో మాట్లాడి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అంతే కాదు కాస్త కామెడీ కూడా చేసింది. ఇక సందర్భంగా ఒక అభిమాని ఆ దేవుడు నాకు ఎదురైతే నన్ను నీ భర్తని చేయమని అడుగుతా అని అనగా.. దానికి రష్మిక దయచేసి ముందు ఇతడి అనుమతి తీసుకో అని తన పెంపుడు కుక్క ఫొటో షేర్ చేసింది. అంతేకాదు ఇంకా చాలా ప్రశ్నలు అడగగా వాటికి కూడా సమాధానాలు చెప్పింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అమ్మ అడిగింది తన బయోపిక్ రాయమని..!

ఇప్పుడు బయోపిక్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సినిమా, రాజకీయ, క్రీడా కారులు ఇలా ఒక రంగానికి చెందినవారు కాదు పలు రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల బయోపిక్ లు తీస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మరో బయోపిక్ తెరపైకి వచ్చింది. అది ఎవరిదో కాదు. టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ భార్య.. దివంగత విజయ నిర్మల జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో సినిమాలో కీర్తి సురేష్‌ ను అనుకుంటున్నారని... విజ‌య నిర్మ‌ల త‌న‌యుడు న‌రేష్ ఈ చిత్రాన్ని రూపొందించే ప‌నిలో ఉండ‌గా, ఇప్ప‌టికే సినిమాలో ప్ర‌ధాన పాత్ర కోసం కీర్తి సురేష్‌ని సంప్ర‌దించాడ‌ని.. కీర్తి సురేష్ కూడా గ్రీన్ సిగ్న‌ల్…

TFN Adminవాట్సాప్
Mega Star Chiranjeevi Believes Ramcharan Only Can Do Justice To That Role
సినిమా వార్తలు

చరణే కావాలంటున్న చిరు..!

కొరటాల శివ-చిరు కాంబినేషన్ 'ఆచార్య' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం బ్రేక్ పడింది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది.

TFN Adminవాట్సాప్
బాక్సాఫీస్

అన్నా-తమ్ముడి పోరు తప్పేలా లేదే..!

కరోనా వల్ల ఎక్కడి సినిమా షూటింగ్ లు అక్కడ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాలు ఆగిపోగా.. ఈ ఏడాది రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు కూడా వచ్చే ఏడాదికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమా పింక్ కూడా ఉంది. ప్రస్తుతం హిందీలో సూపర్ హిట్ కొట్టిన పింక్ రీమేక్ ను తెలుగులో 'వకీల్ సాబ్' సినిమాను చేస్తున్నాడు. శ్రీరామ్ వేణు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నిజానికి 'వకీల్ సాబ్' సినిమా మే15 న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ వల్ల షూటింగ్ కూడా మధ్యలోనే ఆగిపోయింది. దీనితో ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసే పాలన్ లో ఉన్నట్టు వార్తలు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

క్రేజీ కాంబినేషన్ లో సస్పెన్స్ థ్రిల్లర్..!

సినిమా హిట్లు ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. ఇటీవలే 'కాప్పాన్' తెలుగులో 'బందోబస్త్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు సుధా కొంగర దర్శకత్వంలో సూర్య మరో కొత్త సినిమాలో నటిస్తున్నాడు. తమిళ్ లో ‘సూరరై పోట్రు’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ (అసాధారణ కలలు కన్న సాధారణ వ్యక్తి కథ)టైటిల్‌తో విడుదల కానుంది. కెప్టెన్ గోపినాధ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సూర్య నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

విలక్షణ మూవీ "ఫైటర్ "- విజయ్ దేవరకొండ

ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ గా పేరుపొందిన విజయ్ దేవరకొండ ఆ జానర్ మూవీస్ లో నటించకుండా డిఫరెంట్ జానర్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాను హీరోగా నటిస్తున్న "ఫైటర్"(వర్కింగ్ టైటిల్)మూవీ ఒక విలక్షణ సినిమా అని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా రూపొందుతుందని విజయ్ చెప్పారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

భారీ రెమ్యునరేషన్ డిమాండ్ ?

బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీ లో తెలంగాణ యువతి భానుమతి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని సాయి పల్లవి క్రేజీ హీరోయిన్ గా మారారు. సాయి పల్లవి ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరో గా రూపొందుతున్న "లవ్ స్టోరీ ", వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా హీరోగా రూపొందుతున్న "విరాటపర్వం" మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నటనకు కేరాఫ్ అడ్రస్ - మీరు మెచ్చిన 'సామ్' సినిమా

ఏం మాయ చేసావే సినిమాతో తన నటనతో అందరినీ మాయ చేసి.. దూకుడు సినిమాతో దూకుడిని పెంచి... వరుస హిట్స్ తో దూసుకుపోతూ.. యూటర్న్ సినిమాతో మహిళా ప్రాధాన్యత సినెమాలకు యూ టర్న్ తీసుకొని.. ఇటీవల జాను సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో జానుగా మిగిలిపోయిన హీరోయిన్ సమంత. మొదటినుండి విభిన్నమైన కథలతో.. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కి టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా తను ఉంటే చాలు సినిమా హిట్టే అన్న పేరు తెచ్చుకొని అతి తక్కువ కాలంలోనే సార్ హీరోయిన్ గా ఎదిగింది సమంత. నిజానికి పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అన్నట్టు ఉంటది హీరోయిన్ కెరీర్. కానీ సమంత విషయంలో అది కూడా రివర్స్ అయింది. పెళ్ళైన తర్వాత కూడా సామ్ వరుస…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'కేజీఎఫ్' డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా ఖాయమేనట..!

ప్రభాస్ తో కేజీఎఫ్ డైరెక్టర్ సినిమా.. ఇది ఎప్పటినుండో వస్తున్న వార్తలే. అప్పట్లో ప్రశాంత్ నీల్ ప్రభాస్ ను కలిసి ఓ కథను వినిపించాడని... ఇక ప్రభాస్ కు కథ నచ్చి ఓకే చెప్పినట్టు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకూ ఆ వార్తలపై క్లారిటీ రాలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం... ఈ డైరెక్టర్ తో ప్రభాస్ తో సినిమా ఖాయమైనట్టే వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ సినిమా సీక్వెల్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారుఅది పూర్తయిన తరువాత ప్రభాస్ స్క్రిప్ట్ పై కూర్చుంటాడని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్

షేర్