క్రేజీ కాంబినేషన్ లో సస్పెన్స్ థ్రిల్లర్..!

Versatile Actor Suriya To Join Hands With Director Gautham Vasudev Menon For A Suspense Thriller, Versatile Actor Suriya, Director Gautham Vasudev Menon, Suriya Next Suspense Thriller, Suriya, Suriya Next movie with Director Gautham Vasudev Menon, Actor Suriya New Movie, Suriya Latest News 2020, Latest Telugu Movie News, Latest Tollywood News, Telugu Film News 2020, Tollywood Movie Updates, Telugu Filmnagar

సినిమా హిట్లు ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. ఇటీవలే ‘కాప్పాన్’ తెలుగులో ‘బందోబస్త్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు సుధా కొంగర దర్శకత్వంలో సూర్య మరో కొత్త సినిమాలో నటిస్తున్నాడు. తమిళ్ లో ‘సూరరై పోట్రు’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ (అసాధారణ కలలు కన్న సాధారణ వ్యక్తి కథ)టైటిల్‌తో విడుదల కానుంది. కెప్టెన్ గోపినాధ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సూర్య నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమానే ఇంకా పలు సినిమాలను కూడా సూర్య లైన్ లో పెట్టాడు. హరి దర్శకత్వంలో ‘సింగం’ సీక్వెల్ చేస్తున్నాడు. ఆ తరువాత శివ ,వెట్రిమారన్, లోకేశ్ కనగరాజ్ లను లైన్లో పెట్టేశాడు. ఈ సినిమాలన్నీ కూడా ఒకదాని తరువాత ఒకటిగా మొదలుకానున్నాయి. ఇప్పుడు తాజాగా మరో వార్త వినిపిస్తుంది. గౌతమ్ మీనన్, సూర్యల కాంబినేషన్ కూడా మరో సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది.

నిజానికి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్టు గత కొంత కాలంగా వార్తలు వస్తూనే వున్నాయి.. వార్తలు వచ్చినా ఎక్కడా కన్ఫర్మేషన్ అందలేదు. దీంతో ప్రాజెక్ట్ ఉంటుందో లేదో అనుకున్నారు అందరూ. కానీ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఇటీవలే గౌతమ్ మీనన్ వినిపించిన కథకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ కథ నడుస్తుందట. ఇక గతం లో సూర్య గౌతమ్ కాంబినేషన్ లో కలిసి ‘కాఖ కాఖ, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ లాంటి రెండు భారీ హిట్లు వచ్చాయి. దీనితో ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. మరి సినిమా ఉంటుందో లేదో అన్నది ముందు క్లారిటీ రావాలి. హ్యాట్రిక్ కొడతారా? లేదా అన్నది తరువాత సంగతి..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + nineteen =