వెండి తెరపై కొన్ని కొన్ని కాంబినేషన్స్ అలా సెట్ అయిపోతాయి. అది హీరో – హీరోయిన్ అవ్వొచ్చు, డైరెక్టర్-హీరో, డైరెక్టర్-నిర్మాత ఇలా ఎవరైనా అవ్వొచ్చు. కొన్ని కాంబినేషన్స్ మాత్రం అలా వర్క్ అవుట్ అవుతాయి. ఇక హీరో హీరోయిన్స్ కాంబినేషన్స్ కు వస్తే పాత తరం నుండి ఈ తరం వరకూ కొన్ని హిట్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇప్పటితో పోల్చుకుంటే.. పాత తరంలో కాస్త హీరోయిన్స్ తక్కువ కాబట్టి కాంబినేషన్స్ రిపీట్ అవుతూనే ఉండేవి. ఆ తరువాత మన అగ్ర హీరోలు కూడా ఒక్కో హీరోయిన్ తో బాగానే సినిమాలు తీశారు. చిరు రాధ, చిరు విజయశాంతి, చిరు రాధిక వీరి కాంబినేషన్స్ లో చాలా సినిమాలే వచ్చాయి. కమల్ హాసన్ శ్రీదేవి కాంబినేషన్ లో కూడా ఎన్నో సినిమాలు. ఇక ఇప్పుడు ఒకటి రెండు సినిమాలు తీస్తే చాలు మళ్ళీ అదే హీరో-హీరోయిన్ సినిమా అంటే చూడటానికి ప్రేక్షకులకే ఇంట్రెస్ట్ రావట్లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అసలు ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే అక్కడే ఉంది ట్విస్ట్. ఒక హీరో-హీరోయిన్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 107 సినిమాల్లో కలిసి నటించారు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉంది కదా. ఆ హీరో హీరోయిన్ ఎవరంటే మలయాళ చిత్రసీమలో అలనాటి నాయకానాయికలు ప్రేమ్‌నజీర్-శీల. వీరిద్దరూ కలిసి 107 సినిమాల్లో కలిసి నటించి గిన్నిస్‌బుక్‌లో స్థానాన్ని సంపాదించుకున్నారు. అంతేకాదు వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు చాలా వరకూ అన్ని విజయాలనే సొంతం చేసుకోవడం విశేషం. ఎన్నో ప్రేమకథల్లో తమ కెమిస్ట్రీతో ప్రేమ్‌నజీర్-శీల మలయాళ ప్రేక్షకుల్ని అలరించారు.

అంతేకాదు ప్రేమ్‌నజీర్ మరో రెండు గిన్నిస్ రికార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. తన సినీ కెరీర్లో 720 సినిమాల్లో హీరోగా నటించిన ఆయన అత్యధిక సినిమాల్లో కథానాయకుడిగా నటించి రికార్డు సృష్టించారు. దానితో పాటు 1979లో ప్రేమ్‌నజీర్ నటించిన 39 సినిమాలు విడుదలయ్యాయి. ఒక ఏడాదిలో అత్యధిక సినిమాల్లో నటించిన హీరోగా ఘనతను సొంతం చేసుకున్నారు ప్రేమ్‌నజీర్.
మరి ఇన్ని సినిమాల్లో కలిసి నటించారంటే మాటలు కాదు. ఏదో కలెక్షన్స్ రికార్డ్స్ అంటే చెరిపేయొచ్చు కానీ.. ఇలాంటి రికార్డ్స్ అంటే అబ్బో చాలా కష్టమే. ఒక్క మలయాళం మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా వున్న సినీ పరిశ్రమ మొత్తం ఈ రికార్డు ను బద్దలు కొట్టడం అసాధ్యమే. సో ఈ లెజెండ్ హీరో రికార్డ్స్ చెరిపేయాలంటే ఆ రోజు ఎప్పుడొస్తుందో చూస్తూ ఉండాలి అంతే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































