బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ లో తెలంగాణ యువతి భానుమతి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని సాయి పల్లవి క్రేజీ హీరోయిన్ గా మారారు. సాయి పల్లవి ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరో గా రూపొందుతున్న “లవ్ స్టోరీ “, వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా హీరోగా రూపొందుతున్న “విరాటపర్వం” మూవీస్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ గా పేరుపొందిన సాయి పల్లవి ఇప్పుడు రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేస్తున్నారని, 1.40కోట్లను అడుగుతున్నట్టు సమాచారం. 2017 సంవత్సరంలో “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి 3 సినిమాలలో నటించిన సాయి పల్లవి, 10 సంవత్సరాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్న అనుష్క, కాజల్, సమంత రెమ్యునరేషన్ లకు సమానంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఎంత ట్యాలెంట్, క్రేజ్ ఉంటే మాత్రం అంత డిమాండ్ చేయడమా అంటూ నిర్మాతలు చర్చించుకుంటున్నట్టు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























