టాలీవుడ్ , కోలీవుడ్ లలో అందాల రాశీఖన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. నటి, మోడల్ , సింగర్ రాశీఖన్నా సూపర్ హిట్ “బెంగాల్ టైగర్ “, “జై లవకుశ”, “తొలి ప్రేమ”, “ప్రతి రోజు పండగే” మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన “వరల్డ్ ఫేమస్ లవర్” మూవీలో హీరోయిన్ గా నటించిన రాశీఖన్నా కొన్ని బోల్డ్ సీన్స్ లో నటించడంతో వివాదాస్పదం అయ్యింది. అభిమానులు షాక్ కు గురి అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




తాజా ఇంటర్వ్యూ లో రాశీఖన్నా మాట్లాడుతూ .. “వరల్డ్ ఫేమస్ లవర్” మూవీలో బోల్డ్ రోల్ లో నటించి తప్పు చేశానని, అభిమానులతో పాటు తన పేరెంట్స్ ను కూడా ఇబ్బంది పెట్టానని, భవిష్యత్ లో అటువంటి పాత్రలలో నటించనని, ఇక పై పాత్రల ఎంపిక లో జాగ్రత్తగా ఉంటానని, గ్లామర్ రోల్స్ లో నటించినా హద్దులు దాటనని చెప్పారు. రిస్క్ తీసుకుని రాశీఖన్నా నటించిన ఆ మూవీ పరాజయం పాలయిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























