‘ఫైట‌ర్’ కోసం సెంటిమెంట్‌ ఫాలో అవుతున్న పూరీ జ‌గ‌న్నాథ్‌?

Dynamic Director Puri Jagannadh Follows This Scentiment For All His Movies

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఒక్కో ద‌ర్శ‌కుడికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ముఖ్యంగా టైటిల్స్ విష‌యంలో. “క‌ళాత‌ప‌స్వి” కె.విశ్వనాథ్‌, భీమ‌నేని శ్రీ‌నివాసరావుకు ‘స‌’,’శ‌’ అక్ష‌రాలు.. సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌కు ‘అ’ అనే అక్షరం టైటిల్స్‌లో ప్రథమాక్షరంగా చాలా సంద‌ర్భాల్లో క‌లిసిరాగా.. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు తేజ‌కు టైటిల్ చివ‌ర‌లో ‘పూర్ణాక్ష‌రం’ (‘చిత్రం’, ‘జయం’.. ఇలా) ఉండ‌డం అచ్చొచ్చింది. వీరిలాగే ‘ఇస్మార్ట్’ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌కి కూడా త‌న సినిమాల టైటిల్స్‌ విషయంలో ఓ సెంటిమెంట్ ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే.. ‘బద్రి’(2000) సినిమాతో ద‌ర్శ‌కుడిగా పరిచ‌యమైన పూరి.. అన‌తికాలంలోనే అగ్ర ద‌ర్శ‌కుడుగా ఎదిగారు. అయితే, గ‌త కొంత‌కాలంగా పూరి త‌న సినిమాల టైటిల్స్ విష‌యంలో ఓ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. అదేమిటంటే.. త‌న టైటిల్స్ చివ‌ర‌లో ‘ర్‌’ అనే అంత్యాక్షరాన్ని పునరావృతం చేస్తున్నారాయ‌న‌. గ‌తంలో పూరి తెరకెక్కించిన చిత్రాల టైటిల్స్‌ను గమనిస్తే.. ఈ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది. ‘సూప‌ర్‌’(2005), ‘గోలీమార్‌’(2010), ‘టెంప‌ర్’(2015), ‘లోఫ‌ర్’(2015), ‘ఇస్మార్ట్ శంక‌ర్’(2019).. ఇలా ఇప్ప‌టికే ఐదు సార్లు `ర్` అంత్యాక్షరంగా పూరీ చిత్రాల పేర్లు వ‌చ్చాయి. ఈ నేపథ్యంలోనే.. యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా పూరి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రానికి కూడా ‘ర్‌’ చివ‌రి అక్ష‌రంగా వ‌చ్చేలా ‘ఫైట‌ర్’ అనే పేరును పరిశీస్తున్నార‌ట ఈ టాలెంటెడ్ డైరెక్టర్.

మ‌రి.. `ర్` అంత్యాక్ష‌రంగా వ‌చ్చిన ‘టెంపర్’, ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’తో భారీ విజ‌యాల్ని అందుకున్న పూరి.. ‘ఫైట‌ర్’తోనూ అదే రిజ‌ల్ట్‌ని రిపీట్ చేస్తారేమో చూడాలి. కాగా, త్వ‌ర‌లోనే ‘ఫైట‌ర్’ టైటిల్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న వచ్చే అవ‌కాశం ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.