అక్కినేని నాగేశ్వరరావు ‘పెళ్లికానుక’కి 60 ఏళ్ళు

Akkineni Nageswara Rao Musical Blockbuster Pelli Kanuka Completes 60 Years.

మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు కెరీర్‌లో పలు మ్యూజిక‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్ ఉన్నాయి. వాటిలో ‘పెళ్లికానుక’ ఒకటి. దర్శకుడు సి.వి.శ్రీధర్ రూపొందించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఏయన్నార్‌కు జోడిగా బి.సరోజా దేవి, కృష్ణకుమారి నటించారు. జగ్గయ్య, గుమ్మడి, రేలంగి, గిరిజ, కె.మాలతి, మాస్టర్ బాబు ముఖ్య భూమికలు పోషించారు. తమిళ చిత్రం ‘కళ్యాణ పరిశు’(1959)కు రీమేక్‌గా ఈ సినిమాను తెర‌కెక్కించారు దర్శకుడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సముద్రాల సీనియర్, ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర గీత రచన చేయగా ఎ.యం.రాజా బాణీలు సమకూర్చారు. “వాడుక మరచెదవేల”, “పులకించని మది పులకించు”, “కన్నులతో పలుకరించు వలపులు”, “ఆడేపాడే పసివాడా”(రెండు వెర్షన్స్), “అక్కయ్యకు సీమంతం”, “తీరేనుగా నేటితోనే”.. ఇలా అన్ని పాటలు విశేషాద‌ర‌ణ పొందాయి. వీనస్ పిక్చర్స్ పతాకంపై ఎస్.కృష్ణమూర్తి, టి.గోవిందరాజన్, శ్రీధర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 1960 ఏప్రిల్ 29న విడుదలైన ‘పెళ్లికానుక’.. నేటితో 60 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.

‘పెళ్లికానుక’ – కొన్ని విశేషాలు:

* ఏయన్నార్, కృష్ణకుమారి జంటగా నటించిన తొలి చిత్రమిదే. అలాగే, ఏయ‌న్నార్, బి.సరోజ హీరోహీరోయిన్‌లుగా నటించిన ఫస్ట్ మూవీ కూడా ఇదే కావడం విశేషం. అంతకుముందు ఏయ‌న్నార్ ‘పెళ్లి సందడి’(1959)లో బి.సరోజ కనిపించినా.. అందులో చలంతో కలిసి జట్టుకట్టింది.
* ‘పెళ్లికానుక’తో సి.వి.శ్రీధర్ దర్శకుడిగా తెలుగునాట తొలి అడుగులు వేశారు.
* తెలుగులో జగ్గయ్య పోషించిన పాత్రని తమిళంలో(‘కళ్యాణ పరిశు’) అక్కినేని నాగేశ్వరరావు పోషించడం విశేషం.
* ‘పెళ్లికానుక’ ఛాయలతో శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రద నాయకానాయికలుగా న‌టించిన ‘దేవత’(1982) సినిమా రూపొందడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − nine =