అన్నా-తమ్ముడి పోరు తప్పేలా లేదే..!

కరోనా వల్ల ఎక్కడి సినిమా షూటింగ్ లు అక్కడ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాలు ఆగిపోగా.. ఈ ఏడాది రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు కూడా వచ్చే ఏడాదికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమా పింక్ కూడా ఉంది. ప్రస్తుతం హిందీలో సూపర్ హిట్ కొట్టిన పింక్ రీమేక్ ను తెలుగులో ‘వకీల్ సాబ్’ సినిమాను చేస్తున్నాడు. శ్రీరామ్ వేణు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నిజానికి ‘వకీల్ సాబ్’ సినిమా మే15 న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ వల్ల షూటింగ్ కూడా మధ్యలోనే ఆగిపోయింది. దీనితో ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసే పాలన్ లో ఉన్నట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే.
ఇక ప్రస్తుతం చిరు, కొరటాల దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ .. త్వ‌ర‌లోనే త‌దుప‌రి షెడ్యూల్ ప్రారంభించ‌నుంది. ప్రస్తుతం కరోనా వల్ల బ్రేక్ పడింది.  మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది.
ఇక ఈ సినిమాను కూడా ఈ ఏడాదే రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ తెలిసిందే కదా. సో లాక్ డౌన్ తీసేసిన తర్వాత ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ చేద్దామనే ప్లాన్ లో ఉన్నారట. ఈ నేపథ్యంలో వచ్చే పొంగల్ అన్నా తమ్ముడి మధ్య పొంగల్ పోరు తప్పేలా లేదు అంటున్నారు సినీ విశ్లేషకులు. అదే  జరిగితే కనుక మెగా వార్ ఏమో కానీ.. మెగా ఫ్యాన్స్ కు మాత్రం పండగే.  వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన ఆర్ఆర్ఆర్ ఎలాగూ పోస్ట్ పోనే అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సో మిగిలిన వారు తమ సినిమాలు చేయడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. అందుకే సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేసే ప్లాన్ లో వున్నారు. మరి చూద్దాం మరి అప్పటి వరకు ఏం జరుగుతుందో.
[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.