మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా “ఉప్పెన ” మూవీ రూపొందింది. సక్సెస్ ఫుల్ తమిళ చిత్ర హీరో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిన్న సినిమా అయినా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఉప్పెన ” మూవీ విజయం పై నిర్మాతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




రిలీజ్ కు సిద్ధమైన “ఉప్పెన ” మూవీ కరోనా కారణం గా వాయిదా పడింది. లాక్ డౌన్ తరువాత థియేటర్స్ ఓపెన్ అయితే రిలీజ్ కావాల్సిన సినిమాలు క్యూ కడతాయి. అందువల్ల వెయిట్ చేసి “ఉప్పెన ” మూవీ ని డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ మూవీ తో హీరో సాయి తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా టాలీవుడ్ కుపరిచయం అవుతున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ మూవీ పై అంచనాలు పెంచాయి. “ఉప్పెన ” మూవీ తమిళ రీమేక్ రైట్స్ విజయ్ సేతుపతి స్వంతం చేసుకున్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























