బర్త్ డే కి సమంత కొత్త నిర్ణయం..!

Actress Samantha Akkineni Takes New Resolutions On Her Birthday
Actress Samantha Akkineni Takes New Resolutions On Her Birthday

ఒక షుగర్ పేషెంట్ గా అయినా.. పల్లటూరి పిల్ల అయినా.. నత్తి గా మాట్లాడే పాత్ర అయినా.. ఏపాత్ర అయినా సరే దానికి కరెక్ట్ జస్టిఫై చేసే హీరోయిన్ ఎవరైనా వున్నారంటే ఈ తరం కథానాయికలలో అది సమంత అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏం మాయ చేశావే సినిమాతో సినీ పరిశ్రలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ దక్కించుకొని ఆ తర్వాత నుండి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ‘బృందావనం’, ‘దూకుడు’, ‘ఈగ’, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ఇలా వరుస హిట్స్ తో గోల్డెన్ లెగ్ అయిపోయింది. ఏదో సినిమా చేసాం అయిపోయింది అన్నట్టు కాకుండా.. పాత్ర పాత్ర కు తన వైవిధ్యతను చూపించుకుంటూ ఒక నటిగా తానేంటో నిరూపించుకుంటూ దూసుకుపోతుంది. ఇక పెళ్ళైన తర్వాత కూడా సామ్ వరుస హిట్స్ ను తన ఖాతాలో వేసుకొని పెళ్ళైనా కూడా హీరోయిన్స్ రాణించవచ్చని నిరూపించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక హీరోయిన్ గా తన సత్తా చాటిన సామ్ త్వరలోనే సొంత ప్రొడక్షన్ కూడా పెట్టనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తన పుట్టిన రోజుకు కూడా సామ్ కొత్త నిర్ణయం తీసుకుందట. సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టి కథాబలం ఉన్న సినిమాలను తీయాలని అదేవిధంగా కొత్తవారికీ అవకాశాలు కల్పించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆడవాళ్ళకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే సమంత నిర్మించాలనుకుంటున్నారట. దీనితో పాటు సోషల్ సర్వీసెస్ ను కూడా పెద్ద ఎత్తున చేయాలని నిర్ణయించుకుందట. మరి హీరోయిన్ గా సూపర్ సక్సెస్ అయిన  సామ్ నిర్మాతగా కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.

ప్రస్తుతం సమంత ఇటు తెలుగు, అటు తమిళ్ సినిమాలతో బిజీగా ఉంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ పై కూడా దృష్టి పెట్టింది. బాలీవుడ్ సూపర్ హిట్ అయిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో సమంత కూడా నటిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.