ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 134

కమల్ హాసన్ 'శుభసంకల్పం’కు 25 ఏళ్ళు
మరోసారి నానికి జోడిగా అను ఇమ్మాన్యుయేల్?

లాక్ డౌన్ సమయంలో బిజీ
తెలుగు తెర కుందనపు బొమ్మ సమంత

మల్టీ స్టారర్ మూవీ లో సిద్ధార్థ్
నా మనవరాలు కూడా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తోంది..!
'మిడిల్ క్లాస్ ఫౌండేషన్' ద్వారా విజయ్ సాయం..!
బాలీవుడ్ కి 'ఇస్మార్ట్ శంకర్'.. క్లాస్ హీరో..!
ట్వీట్స్ తో ట్విస్ట్ లు ఇస్తున్న చిరు..!
మరో తెలుగు మూవీ లో ఉపేంద్ర ?
"గీత గోవిందం " మూవీ వద్దు - అల్లు అర్జున్
"ఎన్టీఆర్ 30" లో మరో యంగ్ హీరో ?

'RX 100' సీక్వెల్ కూడా ఉండబోతుంది..!
షార్ట్ ఫిల్మ్ "లాక్ డౌన్ " లో ఆండ్రియా
ప్లే బ్యాక్ సింగర్ గా కెరీర్ ప్రారంభించిన ఆండ్రియా కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. "తడాఖా ", "యుగానికి ఒక్కడు', "గృహం " మూవీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. తమిళ మూవీస్ లో బిజీగా ఉన్న ఆండ్రియా ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించి ప్రేక్షకులను అలరించనున్నారు.
ఇండియన్ బాక్సాఫీస్ సెన్సేషన్ ‘బాహుబలి 2: ది కంక్లూజన్’కి 3 ఏళ్ళు
భారతీయ చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా మూవీస్‌కి ఊపు తెచ్చిన చిత్రం ‘బాహుబలి: ది బిగినింగ్’. ఆ సిరీస్‌లో రెండో చిత్రంగా వచ్చిన ‘బాహుబలి 2: ది కంక్లూజన్’ జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించడమే కాకుండా.. ఇండియన్ హిస్టరీలోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ‘ఛత్రపతి’ ‘బాహుబలి: ది బిగినింగ్’ వంటి ఘనవిజయాల తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ‘బాహుబలి 2: ది కంక్లూజన్’ వారిద్దరికీ హ్యాట్రిక్ మూవీగా నిలవడమే కాకుండా ఇండియన్ హిస్టరీలోనే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
దేశం ప్రేమించిన చిత్రం - నా జీవితంలో అతిపెద్ద చిత్రం 'బాహుబలి2'
ప్రభాస్ అనే పేరు మర్చిపోయి.. బాహుబలి అని పేరును సంపాదించుకున్నాడంటే ప్రభాస్ దానికి కారణం 'బాహుబలి' సినిమా అని ప్రేత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి1. బాహుబలి2 సిరీస్ ల గురించి కొత్తగా చెప్పేదేముంది. తెలుగు సినిమా హద్దుల్ని చెరిపేసి.. మన తెలుగు సినిమా రేంజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా. అంతేకాదు ఇప్పుడు అంత దైర్యంగా.. అసలు ఏ మాత్రం వెనుకాడకుండా భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తున్నారంటే.. దానికి ఓ రకంగా బాహుబలి సినిమా ఇచ్చిన ఇన్స్పిరేషనే కారణమని చెప్పొచ్చు. కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు.. పక్క రాష్ట్రాలు.. దేశాల్లో ఉన్న ప్రేక్షుకులను సైతం…

కమల్ హాసన్ 'శుభసంకల్పం’కు 25 ఏళ్ళు
'లోకనాయకుడు' కమల్ హాసన్, 'కళాతపస్వి' కె.విశ్వనాథ్‌ది కళాత్మకమైన కలయిక. ‘సాగరసంగమం’, ‘స్వాతిముత్యం’, ‘శుభసంకల్పం’.. ఇలా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు తెలుగునాట 'క్లాసిక్స్' స్టేటస్‌ను పొందాయి. అంతేకాదు.. ఇటు రివార్డులతోనూ అటు అవార్డులతోనూ వార్తల్లోకెక్కాయి. ‘సాగరసంగమం’, ‘స్వాతిముత్యం’ వంటి బ్లాక్‌బస్టర్స్ తరువాత కమల్, విశ్వనాథ్ కలయికలో వచ్చిన 'శుభసంకల్పం’ వారిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా నిలిచింది. అలాంటి 'శుభసంకల్పం’ విడుదలై నేటికి సరిగ్గా పాతికేళ్ళు. ఈ సందర్భంగా ఆ సినిమా జ్ఞాపకాల్లోకి వెళితే..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండస్ట్రీ హిట్ ‘పోకిరి’కి 14 ఏళ్ళు
“ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుద్దో ఆడే పండుగాడు”.. ఈ పంచ్ డైలాగ్ థియేటర్లలో పేలి నేటికి సరిగ్గా 14 ఏళ్ళు. “ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను” అంటూ పండుగాడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన సందడి అంతా ఇంతా కాదు. అంతేనా.. “ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా” అంటూ ‘పోకిరి’గా తన ఖాతాలో తొలి ఇండస్ట్రీ హిట్‌ని వేసుకున్నాడీ ఘట్టమనేని హ్యాండ్సమ్ హీరో. ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందించిన ‘పోకిరి’లో మహేష్ తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా దర్శనమివ్వడం విశేషం. ఇందులో మహేష్‌కు జోడిగా ఇలియానా నటించగా ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్ధి, నాజర్, షాయాజి షిండే, సుబ్బరాజు…
మరోసారి నానికి జోడిగా అను ఇమ్మాన్యుయేల్?
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన ‘మజ్ను’(2016)తో తెలుగుతెరకు కథానాయికగా పరిచయమైంది అను ఇమ్మాన్యుయేల్. ఆపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వంటి అగ్ర కథానాయకులతో ఆడిపాడింది. స్వల్ప విరామం అనంతరం.. ‘అల్లుడు అదుర్స్’లో ఓ నాయికగా నటిస్తోంది అను. ఇదిలా ఉంటే.. తాజాగా అను ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరిందని సమాచారం.

లాక్ డౌన్ సమయంలో బిజీ
"లక్ష్మీ కళ్యాణం " మూవీ తో సినీ కెరీర్ ను ప్రారంభించిన కాజల్ అగర్వాల్ తన అందం, అభినయం తో ప్రేక్క్షకులను ఆకట్టుకుని అనేక తెలుగు, తమిళ సూపర్ హిట్ మూవీస్ లో నటించి టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. "మోసగాళ్ళు" , "ఆచార్య " మూవీస్ లో నటిస్తున్న కాజల్ రెండు తమిళ, ఒక హిందీ మూవీ లో నటిస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా నటించిన "ప్యారిస్ ప్యారిస్ " తమిళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
తెలుగు తెర కుందనపు బొమ్మ సమంత
సమంత.. ఈ జనరేషన్ హీరోయిన్స్‌లో సక్సెస్ రేటు ఎక్కువ ఉన్న కథానాయిక. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా తెలుగునాట పదేళ్ళకు పైగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ చెన్నై చిన్నది. కెరీర్ ఆరంభంలో రొమాంటిక్, గ్లామర్ పాత్రలతో యువతను తన వైపు తిప్పుకున్న సామ్.. ప్రస్తుతం ఫ్యామిలీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్తోనూ, నాయికా ప్రాధాన్యత ఉన్న పాత్రలతోనూ మెప్పిస్తోంది.

మల్టీ స్టారర్ మూవీ లో సిద్ధార్థ్
"నువ్వొస్తానంటే నేనొద్దంటానా ", "బొమ్మరిల్లు ", "జబర్దస్త్ " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన సిద్ధార్థ్ తరువాత తమిళ మూవీస్ తో బిజీగా మారారు. చాలా రోజుల తర్వాత సిద్ధార్థ్ తెలుగు లో ఒక మల్టీ స్టారర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టాలీవుడ్ కు సిద్ధార్థ్కమ్ బ్యాక్ మూవీ గా ఈ మల్టీ స్టారర్ రూపొందనుంది.
నా మనవరాలు కూడా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తోంది..!
ఇటీవల ఒక పాటను మాత్రం తరచూ పాజ్ చేస్తూ .. మళ్లీ మొదటి నుంచి వింటూ ఎంజాయ్ చేస్తున్నాను. అందుకు కారణం ఏమిటనేది రేపు ఉదయం 9 గంటలకు చెబుతాను" అని చిరు నిన్న తన ట్విట్టర్ ద్వారా సస్పెన్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పాట ఏంటో చెప్పేశారు మెగా స్టార్. తన మనవరాలితో ఖైదీ నెం 150 సినిమాలోని పాటను వింటూ ఎంజాయ్ చేస్తున్న వీడియో ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి.. 'మ్యూజిక్ కు ఉన్న పవర్ ను చూసి నేను ఎప్పుడూ అద్భుతమైన అనుభూతికి లోనవుతుంటానని చిరంజీవి అన్నారు. ఒక ఏడాది వయసున్న తన మనవరాలు కూడా మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తోందని చెప్పారు. పాటకు తగ్గట్టుగా డ్యాన్స్ మూమెంట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తోందని…
'మిడిల్ క్లాస్ ఫౌండేషన్' ద్వారా విజయ్ సాయం..!
కరోనా వ్యాధి అరికట్టేందుకు గానూ ప్రభుత్వాలు తమ ప్రయత్నాలు తాము చేస్తుండగా... మరో పక్క సెలబ్రిటీస్ దగ్గరనుండి సామాన్య ప్రజల వరకూ ఎవరికి తోచింది వారు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. కొంత మంది పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తుంటే.. కొంత మంది నిత్యావసర సరుకులు ఇస్తున్నారు. కొంతమంది అన్నం వండి పేదలకు పెడుతున్నారు.
'పుష్ప ' సగం పాటలు అయిపోయాయట..!
లాక్ డౌన్ వల్ల ఎక్కడి షూటింగ్ లు అక్కడ.. సినిమా రిలీలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కొన్నిపనులు మాత్రం చేసుకుంటూనే వున్నారు. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు లాంటివి మాత్రం జరుగుతూనే వున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక వార్త వినిపిస్తుంది. పుష్ప సినిమాకు దేవి శ్రీ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ లో సగం పాటల్ని దేవి రెడీ చేసేశాడట. అసలు లాక్‌డౌన్‌కి తాను ఓ పాట ప్రిపేర్ చేసి, రికార్డింగ్ చేసేసి, చిత్రబృందానికి వినిపించాడట. ఆ పాట విని బన్నీ, సుకుమార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని, ఆ పాటతోనే షూటింగ్ ప్రారంభించాలనుకున్నారని, అయితే లాక్డౌన్ వల్ల ఆ షూటింగ్…
బాలీవుడ్ కి 'ఇస్మార్ట్ శంకర్'.. క్లాస్ హీరో..!
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్ గత ఏడాది జులై నెలలో రిలీజయి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ లో పక్కా మాస్ క్యారెక్టర్ లో నటించి, తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాడు రామ్. పూరి జగన్నాథ్ స్టోరీ, రామ్ ఎనర్జీ చిత్ర విజయానికి ప్లస్ అయ్యాయి.
ట్వీట్స్ తో ట్విస్ట్ లు ఇస్తున్న చిరు..!
ఎంతైనా మెగా స్టార్ మెగా స్టారే. ఎక్కడున్నా తన విభిన్నతను చూపిస్తాడు. ఇటీవలే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన చిరు.. చాలా యాక్టీవ్ గా వుంటున్నారు. యంగ్ హీరోలు కూడా చిరు అంత యాక్టీవ్ గా ఉండలేకపోతున్నారు. తన ట్విట్టర్ ద్వారా ఏదో ఒక విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. అంతేకాదు అప్పుడప్పుడు ట్విస్ట్ లు కూడా ఇస్తున్నారు. ఇటీవలే (సశేషం).. అంటూ ఒక ట్వీట్ పెట్టి అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచాడు. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి ట్వీట్ చేసి అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచాడు.
మెగా-దగ్గుబాటి-అక్కినేని కాంబోలో దర్శకేంద్రుడి మల్టీ స్టారర్ ప్లాన్..!
పాతతరం లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ , కృష్ణ మల్టీ స్టార్ సినిమాలు చాలానే చేశారు. ఒకపక్క సోలో హీరోగా చేసినా కూడా మరోపక్క వేరే హీరోలతో కలిసి స్క్రీన్ ను పంచుకునేవాళ్ళు. అయితే ఆ తర్వాత మాత్రం ఈ మల్టీ స్టారర్ సినిమాలకు బ్రేక్ పడిందని చెప్పొచ్చు. ఎన్నో ఏళ్ళ తర్వాత 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో వెంకీ, మహేష్ బాబు మల్టీ స్టారర్ రావడంతో మరోసారి టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలకు బీజం పడింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో విక్టరీ వెంకటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు మహేష్. చిన్నోడా.. పెద్దోడా అంటూ ఆడియన్స్ ను అలరించి హిట్ కొట్టారు. ఈ తరం హీరోలు మల్టీ…
మరో తెలుగు మూవీ లో ఉపేంద్ర ?
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కు తెలుగు ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఉంది. కన్నడ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో క్రేజ్ పెంపొందించుకున్న ఉపేంద్ర కొన్ని తెలుగు మూవీస్ లో కూడా నటించారు. కమర్షియల్ హిట్ "S/O సత్యమూర్తి " మూవీ లో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించిన ఉపేంద్ర ఆమూవీ తరువాత తెలుగు మూవీస్ లో నటించలేదు. ఇప్పుడు ఉపేంద్ర ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
"గీత గోవిందం " మూవీ వద్దు - అల్లు అర్జున్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ "గీత గోవిందం" మూవీ ఘనవిజయం సాధించింది. రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడిన ఈ మూవీ 100కోట్ల క్లబ్ లో చేరింది. తన స్వంత బ్యానర్ లో రూపొందిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ లో అల్లు అర్జున్ ఎందుకు నటించలేదనే సందేహం అందరికీ వచ్చింది.
"ఎన్టీఆర్ 30" లో మరో యంగ్ హీరో ?
హారిక &హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా "ఎన్టీఆర్ 30" మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. "రౌద్రం రణం రుధిరం " మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత ప్రారంభం అయ్యే ఈ మూవీ లో ఒక యంగ్ హీరో కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం. దర్శకుడు త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారు.
'వరల్డ్ ఫేమస్ లవర్' లో నా లిమిట్స్ క్రాస్ చేశా..!
ఒక హీరోయిన్ కు బోల్డ్ సన్నివేశాల్లో నటించాలంటే ఎంత కష్టమో నటించే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. మొదటి నుండి ఆ ఇమేజ్ ఉన్న హీరోయిన్స్ కు అయితే అది పెద్దగా పట్టించుకోరు. వాళ్ళ పద్దతిలో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ కొంతమంది హీరోయిన్స్ వుంటారు.. మొదటినుండి కాస్త గ్లామర్ రోల్స్ కు తక్కువగా.. బోల్డ్ సన్నివేశాలకు దూరంగా. అలాంటి హీరోయిన్స్ కు మాత్రం ఇది కష్టమే అని చెప్పొచ్చు. అలా ఇన్ని రోజులు బోల్డ్ సన్నివేశాలకు దూరంగా ఉన్న రాశీ ఖన్నా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో అలాంటి సన్నివేశాల్లో నటించింది. అయితే ఇప్పుడు తాజాగా ఆ సన్నివేశాల్లో నటించడంపై స్పందించి పలు ఆసక్తికర వ్యాఖ్యలే చేసింది.

'RX 100' సీక్వెల్ కూడా ఉండబోతుంది..!
తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాగా విడుదలైన ఆర్ఎక్స్ 100 సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి సూపర్ హిట్టయింది. ఈ ఒక్క సినిమాతో కార్తికేయ, పాయల్ రాజ్, డైరెక్టర్ అజయ్ భూపతి కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ముగ్గురు పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు.