రకుల్ ప్రీత్ కరోనా చిట్కాలు

Actress Rakul Preet Singh Shares Healthy Food Tips To Stay Immune During Lockdown.

కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ తో ప్రజలంతా ఇళ్ళకే పరిమితం అయ్యారు. ప్రాణాంతక కరోనా వ్యాప్తి నివారణకు స్వీయ గృహ నిర్బంధం తోపాటు వ్యాధి నిరోధక శక్తి ని కూడా బలోపేతం చేసుకొనడం ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా వ్యాప్తి నివారణ కై సినీ సెలబ్రిటీస్ సోషల్ మీడియా ద్వారా ప్రజలలో అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ కొన్ని చిట్కాలు చెప్పారు. సి విటమిన్ ఉన్న ఫ్రూ ట్స్, కూరగాయలు విరివిగా తీసుకోవాలని , సహజ పద్ధతులతో ఇమ్యూనిటీ పెంచుకొనే ఒక పానీయం గురించి తెలిపారు. అల్లం , మిరియాలు, పసుపు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అర లీటర్ నీటిలో మరిగించాలని, చల్లారిన తరువాత తేనె తో ఆ పానీయం తాగితే శరీరానికి తక్షణ శక్తి నిస్తుందని, ఇమ్యూనిటీ బూస్టర్ గా పని చేస్తుందని రకుల్ తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.