రష్మిక మీ భర్త కావాలని ఉంది.. అయితే అతడి అనుమతి తీసుకోవాలి..!

Rashmika Mandanna funny q & a with fans
Rashmika Mandanna funny q & a with fans

కరోనా వల్ల సినిమా సెలెబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇక సోషల్ డిస్టెన్స్ అయితే వుంది కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులకు ఎప్పటికప్పుడు దగ్గరగానే వుంటున్నారు. వాళ్ళతో లైవ్ ల ద్వారా మాట్లాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రష్మిక కూడా తన అభిమానులతో మాట్లాడి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అంతే కాదు కాస్త కామెడీ కూడా చేసింది.
ఇక సందర్భంగా ఒక అభిమాని ఆ దేవుడు నాకు ఎదురైతే నన్ను నీ భర్తని చేయమని అడుగుతా అని అనగా.. దానికి రష్మిక దయచేసి ముందు ఇతడి అనుమతి తీసుకో అని తన పెంపుడు కుక్క ఫొటో షేర్ చేసింది. అంతేకాదు ఇంకా చాలా ప్రశ్నలు అడగగా వాటికి కూడా సమాధానాలు చెప్పింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ అయిపోయిన తర్వాత మీరు చేసే మొదటి పని ఏంటి అని అడిగితే దానికి ముందు నా స్నేహితులను కలుస్తా వారి జాబితా చాలా పెద్దది అని చెప్పింది. ఇంకా నటననే ఎందుకు కెరీర్ గా ఎంచుకున్నారు అన్న ప్రశ్నకు.. ప్రేక్షకుల నవ్వుకు నేను కూడా ఓ కారణం కావాలనుకున్నా.. అది ఒక్క సెకన్ అయినా చాలు అని చెప్పింది.

కాగా ప్రస్తుతం రష్మిక సుకుమార్ అల్లుఅర్జున్ కాంబినేషన్ లో వస్తున్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా విభిన్నమైన యాస కూడా నేర్చుకుంటుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.