చరణే కావాలంటున్న చిరు..!

Mega Star Chiranjeevi Believes Ramcharan Only Can Do Justice To That Role
Mega Star Chiranjeevi Believes Ramcharan Only Can Do Justice To That Role

కొరటాల శివ-చిరు కాంబినేషన్ ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం బ్రేక్ పడింది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో మహేష్ బాబు కానీ, చరణ్ కానీ నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఒకసారి మహేష్ బాబే నటిస్తున్నాడు అంటారు. మరో రెండు రోజులు ఆగితే లేదు లేదు చరణే నటిస్తున్నాడు అన్న వార్తలు వచ్చాయి అప్పట్లో. వాటికి చిరు బ్రేక్ వేసాడు. మహేష్ పేరు ఎలా వచ్చిందో తెలీదు… బట్ మొదటినుండి రామ్ చరణ్ అయితే ఈ రోల్ కు సరిపోతాడని కొరటాల చెప్పడంతో మొదటినుండి రాంచరణ్ నే అనుకున్నాం అని చెప్పాడు.

అయితే అప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు. ఎందుకంటే.. కరోనా కనుక రాకపోయి ఉంటే ఆర్ఆర్ఆర్ షూటింగ్ మరి కొద్దిరోజుల్లో పూర్తయి ఉండేది. అప్పుడు చరణ్ కు కూడా డేట్స్ సర్దుబాటు చేయడం కుదిరేది. కానీ ఇప్పుడు అన్నీ మారిపోయాయి. కరోనా వల్ల ఆర్ఆర్ఆర్ షూట్ కూడా లేట్ అవ్వడంతో ఇప్పుడు అది కూడా కుదరని పరిస్థితి. అయితే చిరు మాత్రం చరణ్ ఈ రోల్ ఎట్టి పరిత్తితుల్లో మిస్ కావొద్దని చూస్తున్నాడట. చాలా స్ట్రాంగ్ రోల్ కావటంతో ఆ రోల్ కు తాను అయితేనే బావుంటుందని అనుకుంటున్నాడట. ఇక ఈ సినిమా కోసం ఎలా లేదనుకున్నా ఓ 30 రోజులు వరకు డేట్స్ ఇవ్వాల్సి వస్తుంది చరణ్. అసలు సమస్య ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ లుక్ కు ఈ లుక్ కు సంబంధం ఉండదు. సో ఇలాంటి పరిస్థితుల్లో రాజమౌళి, కొరటాల, చిరు, చరణ్ మాట్లాడుకుంటే కానీ సెట్ అవ్వదు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ అయిపోయేదాకా ఆగి.. ఆ లోపు మిగిలిన షూట్ పూర్తి చేసుకొని.. ఆ తరువాత చరణ్ తో షూట్ చేసుకోడమే.. చూద్దాం ఏం జరుగుతుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.