ఏం మాయ చేసావే సినిమాతో తన నటనతో అందరినీ మాయ చేసి.. దూకుడు సినిమాతో దూకుడిని పెంచి… వరుస హిట్స్ తో దూసుకుపోతూ.. యూటర్న్ సినిమాతో మహిళా ప్రాధాన్యత సినెమాలకు యూ టర్న్ తీసుకొని.. ఇటీవల జాను సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో జానుగా మిగిలిపోయిన హీరోయిన్ సమంత. మొదటినుండి విభిన్నమైన కథలతో.. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కి టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా తను ఉంటే చాలు సినిమా హిట్టే అన్న పేరు తెచ్చుకొని అతి తక్కువ కాలంలోనే సార్ హీరోయిన్ గా ఎదిగింది సమంత. నిజానికి పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అన్నట్టు ఉంటది హీరోయిన్ కెరీర్. కానీ సమంత విషయంలో అది కూడా రివర్స్ అయింది. పెళ్ళైన తర్వాత కూడా సామ్ వరుస హిట్స్ తో దూసుకుపోతుంది. పెళ్లి అనంతరం ‘రంగస్థలం’ ‘మహానటి’ ‘అభిమన్యుడు’ ‘మజిలీ’ ‘సూపర్ డీలక్స్’ ‘ ఓ బేబీ’, ‘జాను’ లాంటి వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంది సమంత..ఇప్పుడు పలు తెలుగు, తమిళ్ సినిమాతో.. మరో వైపు వెబ్ సిరీస్ తో కెరీర్ లో దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు ఈ టాలెంటెడ్ హీరోయిన్ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక లాక్ డౌన్ నేపథ్యంలో భార్య సమంత కోసం నాగచైతన్య సొంతంగా ఇంట్లోనే కేకు రెడీ చేసి ఆమెతో కట్ చేయించాడు. ఈ పిక్ తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన సమంత.. తాను దేని గురించి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానో గెస్ చేయలేరు అని పేర్కొంది.
ఇక ఈ రోజు సామ్ పుట్టిన రోజు సందర్భంగా మనం కూడా సామ్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని.. మరెన్నో హిట్ సినిమాలు చేయాలని కోరుకుందాం. ఈ నేపథ్యంలో తాను చేసిన సినిమాల్లో మీరు మెచ్చిన సినిమా ఏంటో మీ ఓటు ద్వారా తెలపండి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: