బాలయ్య తో బోయపాటి సినిమా మొదలైన దగ్గరనుండి ఏదో ఒక వార్త తెరపైకి వస్తూనే ఉంది. ఇప్పటికే బాలయ్య పాత్రపై, హీరోయిన్ పై ఇలా పలు విషయాలపై చిత్రయూనిట్ క్లారిటీ ఇస్తూనే వుంది. ఇదిలా ఉండగా తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. అదేంటంటే.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హిట్ కొట్టి.. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి కూడా బాలకృష్ణ సినిమాలో నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. బాలయ్య పాత్రకు అసిస్టెంట్ గా చాలా కీలకమైన రోల్ ఒకటి ఉండగా.. దాని కొరకు ఆయనని తీసుకున్నారని.. రెండు రోజులుగా ఈ వార్త ప్రచారం అవుతుంది. అయితే ఇప్పుడు ఆ వార్తలను ఖండించాడు నవీన్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నేను బాలకృష్ణ గారి సినిమాలో నటించడం లేదు ఆ వార్తలు ఎలా వచ్చాయో అర్ధం కావడం లేదు. ప్రస్తుతానికి తెలుగులో కేవలం జాతిరత్నాలు అనే సినిమా మాత్రమే చేస్తున్నానని నవీన్ వెల్లడించాడు. పిట్టగోడ ఫేమ్ అనుదీప్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో రాహుల్ రామకృష్ణ ,ప్రియదర్శి కూడా హీరోలుగా నటిస్తున్నారు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కరోనా వల్ల పోస్ట్ ప్రొడక్షన్ ఆగిపోయింది…లాక్ డౌన్ అనంతరం మిగతా వర్క్ పూర్తి చేసి సినిమా విడుదల చేస్తామని చెప్పాడు. మరి నవీన్ క్లారిటీ ఇవ్వడంతో ఇవి కేవలం పుకార్లే అని తేలిపోయింది.
కాగా షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా.. రెండో షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్యను గతంలో ఎన్నడూ చూపించని డిఫరెంట్ షేడ్స్ లో బోయపాటి చూపించబోతున్నట్టు తెలుస్తుంది. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా విజయం పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. చూద్దాం మరి హ్యాట్రిక్ కొడతారో?లేదో?
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































